Movie News

ఓటీటీలో ‘ఆహా’ అనిపించే ఓ సినిమా

సంక్రాంతి సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టంతా థియేటర్లలో విడుదలైన నాలుగు కొత్త సినిమాల పైనే ఉంది. కానీ వాటిలో ‘క్రాక్’ మినహా సినిమాలన్నీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. నిజానికి ‘క్రాక్’ సైతం పూర్తి సంతృప్తినిచ్చే సినిమా ఏమీ కాదు. అది కూడా ఒక రొటీన్ మాస్ మసాలా సినిమానే. కాకపోతే ఎక్కడా పెద్దగా బోర్ కొట్టించకుండా, ఒక కమర్షియల్ సినిమా నుంచి ఆశించే అంశాలుంటంతో అది బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తోంది. మంచి లాభాలు కూడా అందుకునేలా కనిపిస్తోంది. మిగతా మూడు చిత్రాల పరిస్థితేంటో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ఐతే సంక్రాంతికి థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఓ చిన్న సినిమా.. ఈ నాలుగు చిత్రాలనూ మించిన స్పందన అందుకుంటోంది. బడ్జెట్, కాస్టింగ్, భారీతనం.. ఈ విషయాల్లో చిన్న స్థాయే కానీ కంటెంట్ పరంగా వాటికంటే ఎంతో ఉన్నతమైన సినిమా అది. ఆ చిత్రం పేరు.. మెయిల్.

‘ఆహా’ ఓటీటీలో సంక్రాంతి కానుకగా పెద్దగా హడావుడి లేకుండా విడుదలైంది ‘మెయిల్’. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు చూస్తేనే ఇదో భిన్నమైన ప్రయత్నం అని అర్థమైంది. అభిరుచి ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఇది ఆకర్షించింది. ఇక సినిమా చూసిన వాళ్లు.. దీన్ని ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి క్లాసిక్‌తో పోలుస్తున్నారు. కాకపోతే దాని లాగా ఇది మరీ సీరియస్ సినిమా కాదు. ఆ చిత్రం ఆంధ్రా ప్రాంత నేపథ్యంలో సాగితే.. మన ఫిలిం మేకర్లు పెద్దగా దృష్టిపెట్టని తెలంగాణ పల్లెలు, అక్కడి మనుషుల అందాన్ని చూపించిన చిత్రం ‘మెయిల్’.

దేశంలో ఐటీ విప్లవం అప్పుడప్పుడే మొదలవుతున్న దశలో ఒక పల్లెటూరికి తొలిసారిగా కంప్యూటర్ వస్తే.. ఒక కుర్రాడికి దాని మీద మోజు పుడితే.. తొలిసారిగా మెయిల్ ఓపెన్ చేస్తే.. ఎక్కడి నుంచైనా తనకో మెయిల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నపుడు 2 కోట్ల రూపాయలు గెలిచినట్లు ఫేక్ లాటరీ మెయిల్ వస్తే.. ఎలా ఉంటుంది.. దీని వల్ల అతడి జీవితం ఎలా ప్రభావితం అయింది అనే నేపథ్యంలో ‘మెయిల్’ నడుస్తుంది.

ఎంతో సహజమైన కథాకథనాలు, నటీనటుల చక్కటి అభినయం.. దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల పనితనం.. ఇలా అన్నీ చక్కగా కుదిరి ‘మెయిల్’ ఒక చక్కటి అనుభూతినిస్తోంది ప్రేక్షకులకు. కొత్త దర్శకుడు ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో ‘స్వప్న సినిమా’ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్షిత్ మల్గిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. వైవిధ్యం ఉన్న రియలిస్టిక్ సినిమాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు తప్పక చూడాల్సిన చిత్రమిది.

This post was last modified on January 15, 2021 3:23 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

48 minutes ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

4 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

8 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

8 hours ago