మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్ అంత సులభంగా మర్చిపోలేరు. అందులోనూ మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను పోటీలో పెట్టుకుని ఘనవిజయం సాధించడం హీరో తేజ సజ్జకి ప్యాన్ ఇండియా మార్కెట్ సాధించి పెట్టింది. హనుమాన్ సెంటిమెంట్ మనకు కొత్త కాకపోయినా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆవిష్కరించిన తీరు అలా నిలిచిపోయింది.
ఇరవై రోజుల క్రితం బాలీవుడ్ లో హనుమాన్ అంశ్ విడుదలయ్యింది. రిలీజ్ టైంలో పెద్దగా అంచనాలు లేవు. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయితే మెల్లగా టాక్ మొదలై క్రమంగా హిట్టు వైపు దూసుకుపోయింది. తొలి వారంలో రోజుకు కేవలం రెండు మూడు వేల టికెట్లు అమ్మిన ఈ డివోషనల్ డ్రామా క్రమంగా దాన్ని పెంచుకుంటూ పోయి మొన్న శనివారం బుక్ మై షోలో ఏకంగా లక్ష టికెట్ల ఫీట్ నమోదు చేసింది. ఇరుముడి, టాక్సిక్ ప్రభంజనంలోనూ హైదరాబాద్ లో 12 షోలు రన్ చేస్తున్నారు.
ఇది ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందింది. 1900 సంవత్సరం ప్రాంతంలో జన్మించిన ఈయన బ్రిటిష్ పాలనలో భక్తి చింతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారు. ఒకసారి రైలు ప్రయాణం చేస్తుండగా ఇంగ్లీష్ ఆఫీసర్ కరోలి బాబాని మధ్యలోనే దింపేస్తారు. ఆ తర్వాత ట్రైన్ అంగుళం కూడా ముందుకు కదలదు. దీంతో సదరు అధికారి క్షమాపణ చెప్పాకే బండి కదులుతుంది. అందుకే ఆ స్టేషన్ బాబా పేరు మీదే ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి.
విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన హనుమాన్ అంశ్ చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా పరిమితంగా ఉంటాయి. సహజమైన లొకేషన్లలో ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఆధారంగా చేసుకుని తీశారు. ఇప్పటిదాకా పదిహేను కోట్లకు పైగానే వసూలు చేసినట్టు సమాచారం. ఇది తక్కువ మొత్తమే అయినా ఎలాంటి ప్రమోషన్ చేయకుండా ఇంత నెంబర్ అందుకోవడం ఘనతే. ఉత్తరాది రాష్ట్రాల్లో నీమ్ కరోలి బాబా భక్తులు మళ్ళీ మళ్ళీ ఈ సినిమాను చూస్తున్నారట.
This post was last modified on August 26, 2026 10:21 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…