Movie News

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. కెజిఎఫ్ రూపంలో యష్ సంపాదించుకున్న ప్యాన్ ఇండియా ఇమేజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానికి నిదర్శనమే వసూళ్లు. టికెట్ రేట్ల పెంపు వల్ల ఏపీ తెలంగాణ అమ్మకాలు ఆలస్యంగా మొదలైనప్పటికీ తెల్లవారుఝాము షోల నుంచే సందడి మొదలైపోయింది. ఎలాగూ సెలవు రోజు కావడంతో యూత్, అభిమానులు మొదటి రోజు చూసేయాలని డిసైడ్ అయిపోయారు.

యష్ ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాఖీ భాయ్ గా తనను ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో కళ్ళముందు కనిపిస్తోంది. అలాని చెప్పి పదే పదే అదే జానర్ లో చూడాలని వాళ్ళు కోరుకోవడం లేదు. కమర్షియల్ సబ్జెక్టులు వద్దని చెప్పడం లేదు. కావాల్సిందల్లా థియేటర్ ఎక్స్ పీరియన్స్ పీక్స్ ఇచ్చే కథలను ఎంచుకోమని చెబుతున్నారు. టాక్సిక్ లో యష్ గుర్తించింది అదే. 1947 గోవా బ్యాక్ డ్రాప్ లో మాఫియా అరాచకం కన్నా సెటప్ ఇంకేం కావాలి.

అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హ్యాండిల్ చేయడం పట్ల కామెంట్స్ మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో టాక్సిక్ బాక్సాఫీస్ ఫలితం ఏంటనేది తేలడానికి ఇంకో మూడు నాలుగు రోజులు పడుతుంది. కానీ నాలుగేళ్ల నిరీక్షణకు యష్ గొప్ప ఫలితమైతే అందుకోవాల్సి ఉంది. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ ని దర్శకురాలిగా ఎంచుకోవడం పట్ల ఇండస్ట్రీలోనే ఎన్నో కామెంట్స్ వినిపించాయి. వాటికి బదులు చెప్పాలి.

వీటి సంగతలా ఉంచితే ఇకపై స్పీడ్ పెంచి ప్రభాస్ లాగా ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేసుకునేలా యష్ ప్లానింగ్ చేసుకుంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. హిట్టు ఫ్లాపు అన్నీ మన చేతుల్లో ఉండవు కానీ వేగం మాత్రం హీరోలు దర్శకుల కంట్రోల్ లోనే ఉంటుంది. అలాంటి వాళ్ళతో పని చేస్తే గొప్ప ఫలితాలు దక్కుతాయి. ఇప్పటికైతే యష్ నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కథలు విన్నాడు కానీ కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. 

This post was last modified on August 26, 2026 12:24 pm

Share

Recent Posts

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

15 hours ago