Movie News

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్, వారణాసి రిలీజ్ గ్యాప్ గురించి అడిగినప్పుడు కూడా అదే కనిపించింది. ప్రభాస్‌తో తాను చేస్తున్న స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని డైరెక్ట్ గా చెప్పేశాడు. రెండింటికీ గ్యాప్ ఉందని, అవసరమైతే వారణాసి కోసం తాము వెనక్కి వెళ్లడానికి కూడా సిద్ధమేనని తెలిపాడు.

ఇదేదో వంగా ఒకరి మెప్పు కోసం అనలేదు. రాజమౌళి వారణాసిని ఏ స్కేల్‌లో తీస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాన్ని బట్టి చూస్తే ఆ మాటలో రియాలిటీ ఉంది. దాదాపు 50 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్థాయిలో తీసుకెళ్లే పని జరుగుతోంది. మహేష్ కెరీర్‌లో కూడా ఇప్పటివరకు ఇలాంటి కాన్వాస్ రాలేదు. పైగా వెయ్యి కోట్ల బడ్జెట్. వంగా కూడా అదే లెక్కను గుర్తించినట్టే కనిపిస్తోంది.

కావాలంటే చాలా ఈజీగా కవర్ డ్రైవ్ ఆడొచ్చు. రెండు సినిమాలు దేనికవే పెద్దవి, రెండింటికీ వేర్వేరు మార్కెట్ ఉంది అంటూ సేఫ్‌గా సమాధానం చెప్పేయొచ్చు. కానీ అలా చేయలేదు. ప్రభాస్‌తో చేస్తున్న తన స్పిరిట్ అనే లెక్క పక్కన పెట్టి వారణాసి పెద్దదని ఒప్పుకున్నాడు. తన ప్రాజెక్ట్ గురించి మాట్లాడే టైమ్‌లో ఇలా చెప్పడం కూడా ప్రతి దర్శకుడు చేసే పని కాదు.

స్పిరిట్ డేట్ మార్చాల్సి వస్తే కూడా సమస్య లేదని చెప్పడం మరో పాయింట్. స్పిరిట్ ను 2027 మార్చి 5న రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. వారణాసి ఏప్రిల్ 7న వస్తోంది. నెలకు పైగా గ్యాప్ ఉన్నందున ఇప్పటికి సమస్య లేదని వంగా చెప్పాడు. స్పిరిట్ షూటింగ్‌లో ఇంకా 65 రోజుల పని మిగిలి ఉందని కూడా క్లారిటీ ఇచ్చాడు.

వంగా సినిమాల విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో తెలిసిందే. ఇక తన ప్రాజెక్ట్‌ను చిన్నది చేసి చూపించకుండా, ఎదురున్న సినిమా స్కేల్‌ను అలాగే అంగీకరించడం అరుదు. స్పిరిట్ కూడా ప్రభాస్ కెరీర్‌లో పెద్ద సినిమానే. కానీ వారణాసి విషయంలో రియాలిటీ ఏంటో దాన్ని కవర్ చేయకుండా చెప్పేశాడు. అందుకే వంగా మాటలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

This post was last modified on August 26, 2026 10:12 am

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

1 hour ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

4 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

4 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

4 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

5 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

8 hours ago