Movie News

నాగ్ ఫ్యాన్స్… రెడీ అవ్వండమ్మా

అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దర్శకుడిగా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి తమిళ దర్శకుడు రా.కార్తీక్‌తో నాగ్ జట్టు కట్టాడు. ఐతే నాగ్ ఇంత ప్రెస్టీజియస్ మూవీ చేస్తూ.. దానికి అధికారికంగా ప్రారంభోత్సవం జరపకపోవడం, సినిమా మొదలై ఏడాది కావస్తున్నా టైటిల్ సహా ఏ విశేషాన్నీ అభిమానులతో పంచుకోకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. 

షూటింగ్ చాలా వరకు అయిపోయినా ఇప్పటికీ ఏ అప్‌డేట్ లేదు. కనీసం తన పుట్టిన రోజు నాడైనా నాగ్.. ఈ సినిమా విశేషాలను బయటపెడతాడా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నాగ్ బర్త్ ‌డేకి ఇంకో మూడు రోజులే మిగిలుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఐతే అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన పనేమీ లేదని తెలుస్తోంది. శనివారం నాడు నాగ్ పెద్ద ట్రీటే ఇవ్వబోతున్నాడట.

నాగ్ 100వ సినిమా టైటిల్ గ్లింప్స్‌‌ను కింగ్ పుట్టిన రోజు నాడు పంచుకోనున్నారట. ఈ సినిమా ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా గ్లింప్స్ ఉంటుందట. ఇందులో నాగ్ మిడిలేజ్డ్ రోల్‌లో కనిపించబోతున్నాడట. తండ్రి-కూతురి బంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. కుటుంబ అంశాలతో పాటు యాక్షన్, థ్రిల్ మిక్స్ అయిన సినిమా ఇదని అంటున్నారు. ఈ చిత్రంలో టబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. గతంలో ‘నాట్యం’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన సుష్మిత భట్ ఇంకో కీలక పాత్రలో కనిపించనుంది. 

నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగ్ 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు డిఫరెంట్ గెటప్స్‌తో కనిపిస్తాడట. శనివారం రిలీజ్ చేసే గ్లింప్స్‌లో నేరుగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని.. ఇక్కడి నుంచి వరుసగా అప్‌డేట్స్‌తో సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తారని సమాచారం. రా.కార్తీక్ ఇంతకుముందు తమిళంలో ఆకాశం, మేడ్ ఇన్ కొరియా, నిత్తమ్ ఒరు వానం సినిమాలు రూపొందించాడు.

This post was last modified on August 26, 2026 4:40 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago