Movie News

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు వెర్షన్ కు సంబంధించి కీలకమైన వేడుక కావడంతో నయనతార తప్ప కాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యింది. విద్యార్థులు, అభిమానులతో ప్రాంగణం నిండిపోయింది. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథుల మాటల్తో ఎలివేషన్లు ఓ రేంజ్ లో పండాయి. టాక్సిక్, యష్ గురించి పొగడ్తల వర్షం మాములుగా కురవలేదు. డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న దిల్ రాజు పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు.

సంగీతంలో భాగం పంచుకున్న విశాల్ నిర్మాత దిల్ రాజుతో ఒక మాట అన్నారట. ఇది ఖచ్చితంగా రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని. అదే నమ్మకాన్ని రాజుగారు స్టేజి మీద చాలా ఆనందంతో వ్యక్తం చేశారు. అయితే ఇది వాస్తవ రూపం దాల్చాలంటే చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే టాక్సిక్ చిన్న పిల్లల కోసం కాదని, గ్రోన్ అప్స్ కోసమని నిర్మాత దర్శకులే చెబుతున్నారు. ప్రమోషన్లు ట్రైలర్ లో అదే స్పష్టంగా చూపించారు కూడా. సెన్సార్ కూడా ఏ ఇచ్చింది.

అలాంటప్పుడు ఒక వర్గం మద్దతు లేకుండా ఇంత ఫీట్ సాధించాలంటే దురంధర్, పుష్పని మించి టాక్ టాక్సిక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. హైప్ ఉన్న మాట నిజమే కానీ ఫ్రాంచైజ్ క్రేజ్ లేదు కాబట్టి కేవలం కంటెంట్ మీదే ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది. కర్ణాటక, బాలీవుడ్ లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఏపీ తెలంగాణ ఓపెన్ చేశాక వాటికి ధీటుగా ఇక్కడా టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. రేట్ల పెంపు ఉండొచ్చనే టాక్ అయితే ఉంది.

ఒకవేళ టాక్సిక్ కనక అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంటే రెండు వేల కోట్లను టచ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంత వయొలెంట్ ఏ సర్టిఫికెట్ కంటెంట్ తో సాధిస్తే మటుకు యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు అతి పెద్ద ఘనత సాధించినట్టు అవుతుంది. ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు కానీ ఇంకా టికెట్ రేట్ ఎంతనేది బయటికి రాలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ గత రెండు నెలల నుంచి రెగ్యులర్ టికెట్ రేట్లతో మంచి ఊపు మీదుంది. టాక్సిక్ ఏం చేయనుందో చూడాలి

This post was last modified on August 22, 2026 10:27 pm

Share

Recent Posts

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

13 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago