ఓ తమిళ సినిమాకు.. అందులోనూ విజయ్ సినిమాకు సంక్రాంతి వేళ తెలుగు సినిమాలను మించి క్రేజ్ కనిపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? కానీ ఆ ఆశ్చర్యకర పరిణామం ఈసారి సంక్రాంతికి చూశాం. ఈ పండక్కి తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలేవీ లేవు. రేసులో ఉన్న మూడు తెలుగు సినిమాలూ మీడియం రేంజివే. ఇలాంటి సమయంలో విజయ్ మూవీ ‘మాస్టర్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. పెద్ద ఎత్తున సినిమా విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఐతే ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. కానీ అలా జరగలేదు. సినిమా చూసి ప్రతి ఒక్కరూ పెదవి విరిచేవాళ్లే. అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. తమిళ ప్రేక్షకులే సినిమా చూసి పెదవి విరిచేశారు. ఇక తెలుగు ప్రేక్షకుల సంగతి చెప్పాల్సిన పనే లేదు.
విశేషం ఏంటంటే.. ‘మాస్టర్ డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఆ సినిమాను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున మీమ్స్, జోక్స్‌ను సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. సూర్య సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ థియేటర్లలో రిలీజవ్వాల్సిన సినిమా అని.. అది ఓటీటీలో విడుదలైందని.. కానీ ఓటీటీ స్థాయికి సరిపోయే ‘మాస్టర్’ థియేటర్లలోకి రావడం దురదృష్టకరమని ఒక మీమ్ హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి ట్రోల్స్ మరెన్నో ఉన్నాయి. కొన్నేళ్లుగా విజయ్ వరుస బ్లాక్‌బస్టర్లతో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతుంటే చూడలేక పోతున్న యాంటీ ఫ్యాన్స్ పరిస్థితిని సొమ్ము చేసుకుని ‘మాస్టర్ డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ముఖ్యంగా అజిత్ అభిమానులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే భారీ హైప్ మధ్య రిలీజైన ‘మాస్టర్’ ఓపెనింగ్స్‌తోనే చాలా వరకు గట్టెక్కేసేలా ఉంది. తెలుగులో అయితే పెట్టుబడిలో మూడింట రెండొంతుల మొత్తం తొలి రోజే రికవర్ చేసేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
This post was last modified on January 14, 2021 12:13 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…