ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తీస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్ కోసం మొదట కథానాయికగా దీపిక పదుకొనేను తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు ఆమెను తప్పించారు. ఎక్కువ పారితోషకం డిమాండ్ చేయడం, పని వేళల విషయంలో కండిషన్లు పెట్టడం అందుకు కారణాలని వార్తలు వచ్చాయి.
దీని గురించి దర్శక నిర్మాత సందీప్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. నేరుగా దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రిని కథానాయికగా ఎంచుకున్నాడు. మరి దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కచ్చితమైన కారణం ఏంటన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. ఇప్పుడు స్పిరిట్ సహ నిర్మాత, సందీప్ తమ్ముడు ప్రణయ్ రెడ్డి వంగ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
దీపిక స్పిరిట్ మూవీ నుంచి తప్పుకోవడానికి కారణాలంటూ మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవమే అని ప్రణయ్ తెలిపాడు. పారితోషకం, పని వేళల విషయంలో ఆమె పెట్టిన కండిషన్ల వల్లే దీపిక ఈ సినిమా తప్పుకుందని.. ఆమెను తప్పించాలన్న నిర్ణయం సందీప్‌దే అని అతను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీపిక మంచి నటి అని, తన సినిమాలో పాత్రకు బాగా సూటవుతుందనే ఉద్దేశంతో సందీప్ ఆమెను ఎంచుకున్నాడని.. కానీ ఆమె కండిషన్లు, యాటిట్యూడ్ నచ్చక తప్పించాడని ప్రణయ్ తెలిపాడు. స్పిరిట్ లాభాల నుంచి 10 శాతం వాటాను దీపిక డిమాండ్ చేసినట్లు అతను వెల్లడించాడు.
ఐతే అలా అడగడంలో తప్పేమీ లేదని, కానీ అందుకు ఎకనామిక్స్ సహకరించాలని ప్రణయ్ అన్నాడు. దీపికతో సందీప్ ఏడాదిన్నర పాటు జర్నీ చేశాడని.. కానీ తమ మధ్య జరిగిన అంతర్గత విషయాలు, సంభాషణలను దీపిక బయటపెట్టడంతో సందీప్‌కు కోపం వచ్చి ఆమె స్థానంలో త్రిప్తిని రీప్లేస్ చేశాడని ప్రణయ్ తెలిపాడు. మరోవైపు స్పిరిట్‌లో కొరియా నటుడు డాన్ లీతో పాటు ప్రకాష్ రాజ్ లేరని కూడా ప్రణయ్ స్పష్టంచేశాడు. డాన్ లీని కన్సిడర్ చేసినప్పటికీ.. హైదరాబాద్‌లో జరిగే కథలో అతను సింక్ కాలేదని, ప్రకాష్ రాజ్‌ను వేరే కారణంతో వద్దనుకున్నామని ప్రణయ్ వివరించాడు.
This post was last modified on August 21, 2026 12:26 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…