కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక అభిమానుల మొహం వాచిపోయిన తరుణంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కడం మాములు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అందులోనూ బాగా డ్యామేజ్ అయిపోయిన తెలుగు మార్కెట్ తిరిగి రికవర్ కావడం శుభ పరిణామం. ఈ ఏడాదిలో సూర్య రెండు సినిమాలు వచ్చేశాయి. మూడోది దాదాపు పూర్తి కావొస్తోంది. అదే తన 47వ మూవీ.
చెన్నై వర్గాల సమాచారం ప్రకారం సూర్య ఇందులో ఒక షాకింగ్ రోల్ చేయబోతున్నారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీగ లాగుతున్న పోలీస్ ఆఫీసర్ కు అనూహ్యంగా జరిగిన సంఘటనల వల్ల కంటిచూపు పోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూపు లేకుండా ఆ కేసుని తన భుజాల మీద వేసుకుంటాడు. అతనికి తోడుగా నజ్రియా, నస్లెన్ వస్తారు. వీళ్ళ ముగ్గురి మధ్య నడిచే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కథకు ప్రధాన ఆయువుపట్టుగా ఉంటుందని వినికిడి.
జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. క్యాప్షన్ మాత్రం ది వన్ అని పెట్టుకున్నారు. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉన్నప్పటికీ థ్రిల్ చేసే ఎన్నో ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుందని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. సూర్య కెరీర్ లో ఇప్పటిదాకా ఛాలెంజింగ్ అనిపించుకున్న శివపుత్రుడు, కాక కాక, గజిని సరసస ఇది నిలుస్తుందనే బలమైన నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేస్తోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే.
అయితే ఈ సూర్య 47 విడుదల ఎప్పుడనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. రజనీకాంత్ ధర్మన్ కనక సంక్రాంతికి రాకపోతే దీన్ని దింపుతారు. లేదూ అది వచ్చిందంటే 2027 సమ్మర్ కు వెళ్లిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎలాగూ ఈ సంవత్సరం రెండు సినిమాలు వచ్చేశాయి కాబట్టి మరొకటి రిలీజ్ చేసే ఉద్దేశంలో సూర్య లేడు. చాలా కాలం తర్వాత ఖాకీ దుస్తులు వేసుకున్న సూర్య ఈసారి ఎలాంటి పెర్ఫార్మన్స్ తో అదరగొడతాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates