Movie News

అనిరుధ్‌‌కు పిచ్చెక్కించే ఆంధ్రా మీల్స్‌

అనిరుధ్ రవిచందర్‌ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. అతడికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయినా.. నిరాశ చెందకుండా గ్యాంగ్ లీడర్, జెర్సీ, దేవర, కింగ్డమ్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా బలమైన ముద్రే వేశాడు. ఇప్పుడు అతను మ్యూజిక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో తెలిసిందే.

తర్వాత అతను నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో అప్పుడప్పుడు వేరే సంగీత దర్శకుల సినిమాల్లోనూ పాటలు పాడుతూ.. మన వాళ్లతో కనెక్షన్ పెంచుకుంటూ ఉంటాడు అనిరుధ్. తాను పనిచేసే తమిళ చిత్రాలకు సంగీతం సమకూర్చేటపుడు కూడా అతను తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటూ ఉంటాడు. ‘జైలర్-2’ కోసం కూడా తమిళం, తెలుగు మిక్స్ అయిన ఒక పాటను కంపోజ్ చేయనున్న సంగతి వెల్లడైంది.

ఐతే అనిరుధ్ తెలుగు ప్రేమ కేవలం పాటలకు పరిమితం కాదు. అతడి ఫేవరెట్ ఫుడ్ కూడా తెలుగు వాళ్ల స్పెషలేనట. ఒక ఇంటర్వ్యూలో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని వెల్లడించాడు అనిరుధ్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగితే.. నంబర్ వన్ స్పైసీ ఆంధ్రా మీల్స్, నంబర్ టూ స్పైసీ ఆంధ్రా మీల్స్, నంబర్ త్రీ స్పైసీ ఆంధ్రా మీల్స్ అని అనిరుధ్ వ్యాఖ్యానించడం విశేషం.

చెన్నైలో చాలా చోట్ల ఆంధ్రా మీల్స్ అందించే హోటళ్లు ఉండగా.. తెలుగు వాళ్లు నడిపే నేషనల్ లాడ్జ్ అనే హోటల్‌కు తాను రెగ్యులర్ కస్టమర్ అని అనిరుధ్ తెలిపాడు. అది చాలా పాత హోటల్ అని, అక్కడికి తాను రెగ్యులర్‌గా వెళ్లి స్పైసీ ఆంధ్రా మీల్స్ తిని వస్తానని అనిరుధ్ వెల్లడించాడు. తమిళులు మామూలుగా తమ ప్రాంతం, తమ సినిమాలు, తమ కల్చర్, తమ ఫుడ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వేరే వాళ్లను అప్రిషియేట్ చేయడానికి ఇష్టపడరు. కానీ అనిరుధ్ మాత్రం ఇలా ఓపెన్‌గా ఆంధ్రా మీల్స్‌కు ఎలివేషన్ ఇవ్వడం విశేషమే.

This post was last modified on August 20, 2026 3:12 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago