Movie News

అన్నయ్య సెట్లయ్యాడు… తమ్ముడు హిట్టివ్వాలి

గత పదేళ్లలో గట్టిగా చెప్పుకునే ఒక్క బ్లాక్ బస్టర్ లేక అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ తో నెట్టుకుంటూ వస్తున్న హీరో సూర్యకి ఈ సంవత్సరం సూపర్ గా కలిసి వచ్చింది. రిలీజ్ కు ముందు కూడా అష్టకష్టాలు పడిన కరుప్పు మూడు వందల కోట్ల వసూళ్లతో అదిరిపోయే విజయాన్ని అందుకోగా తెలుగులోనూ కమర్షియల్ గా లాభాలు ఇవ్వడం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సైతం డబుల్ సెంచరీ వైపు పరుగులు పెట్టడం అభిమానులకు కిక్ ఇస్తోంది.

సరే అన్నయ్య ట్రాక్ లో పడ్డాడు. నెక్స్ట్ తమ్ముడు వంతు ఉంది. కార్తీ సర్దార్ 2 వచ్చే నెల సెప్టెంబర్ 10 విడుదలకు రెడీ అవుతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై డ్రామాలో కార్తీ డ్యూయల్ రోల్ కొనసాగిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. తమిళనాడులో ప్రమోషన్లు మొదలుపెట్టారు. మన దగ్గర ఇరుముడి, టాక్సిక్ హడావిడి అయిపోయాక స్టార్ట్ చేయబోతున్నారు. మొదటి భాగం ఏపీ తెలంగాణలోనూ మంచి హిట్టయిన సంగతి తెలిసిందే.

చాలా కాలంగా కార్తీ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. అన్నగారు వస్తారు ఘోరంగా దెబ్బకొట్టగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యం సుందరం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. పొన్నియిన్ సెల్వన్ డబ్బులు తెచ్చినప్పటికీ ప్రత్యేకంగా కార్తీకి దక్కిన ప్రయోజనం తక్కువే. ఎందుకంటే టైటిల్ రోల్ జయం రవిది కావడం, విక్రమ్ – ఐశ్వర్యరాయ్ లాంటి క్యాస్టింగ్ ఇలా రకరకాల కారణాల వల్ల కార్తీ ఒక్కడికే క్రెడిట్ దక్కలేదు. హిట్ 3, కంగువ క్యామియోలు కూడా సోసోనే.

ఇప్పుడు భారం మొత్తం సర్దార్ 2 మీదే ఉంది. దర్శకుడు మిత్రన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఊహించని ఎలిమెంట్స్ ఉక్కిరి బిక్కిరి అవుతారని, సినిమా అంత బాగా వచ్చిందని తెగ ఊరిస్తున్నారు. ఇది హిట్ అయితే కార్తీ తర్వాతి సినిమా మార్షల్ కు ఊపు వస్తుంది. ఇది కూడా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఈ మధ్య అప్డేట్స్ కూడా రాలేదు. టాలీవుడ్ లో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, మహేంద్రగిరి వారాహితో పోటీ ఉంది. సర్దార్ 2లో మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. 

This post was last modified on August 20, 2026 3:03 pm

Share

Recent Posts

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

16 seconds ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

53 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago