మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు. అందుకే డిసి, విశ్వనాథ్ అండ్ సన్స్ ఒరిజినల్ కంటే డబ్బింగ్ వెర్షన్లే బాగా ఆడుతున్నాయి. నచ్చితే చాలు హీరో ఎవరనేది కూడా పట్టించుకోరనేది లోకేష్ కనగరాజ్ విషయంలో ఋజువయ్యింది. ఇంత ఓపెన్ హృదయంతో తెలుగు జనాలు ఉంటే తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మటుకు మన సినిమాల విషయంలో చిన్న చూపు చూస్తూనే ఉంది.
ఎల్లుండి విడుదల కాబోతున్న ఇరుముడి తెలుగు వెర్షన్ కు చెన్నైలో ఇప్పటిదాకా కేవలం 9 షోలు ఇచ్చారు. సరే పోనీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ చూడరు అనుకుందాం. అలాంటప్పుడు డబ్బింగ్ వెర్షన్ కు ఎక్కువ ఇవ్వాలి కదా. అవి కూడా 9 షోలే కేటాయించారు. మహా అయితే మొదటి ఆటపడే నాటికి ఒక ఆరేడు పెరగవచ్చు అంతే. రవితేజకు ఫాలోయింగ్ లేకపోవడమనే ప్రశ్న రాదు. ఆ మాటకొస్తే చెన్నైలో తెలుగు జనాభా మరీ తీసికట్టుగా ఏం లేదు, బాగానే ఉన్నారు.
అలాంటప్పుడు కనీస మద్దతు ఇవ్వడం అవసరం కదా. ఈ సమస్య ఇప్పటిది కాదు . చిరంజీవి నుంచి కిరణ్ అబ్బవరం దాకా అందరూ ఫేస్ చేస్తున్నదే. చెన్నై లవ్ స్టోరీకి టైటిల్ లోనే చెన్నై ఉన్నా, సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం అదే నగరంలో జరిగినా మినిమమ్ స్క్రీన్లు దక్కలేదు. టాక్ బయటికి వచ్చాక కూడా పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇరుముడికి ఇది రిపీట్ అవుతోంది. కోలీవుడ్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమారే దీనికి మ్యూజిక్ ఇవ్వడం గమనార్హం.
ఒకటి మాత్రం నిజం. సినిమాలనే కాదు టాలెంట్ ని ప్రోత్సహించడంలోనూ మనోళ్లే ముందున్నారు. ఇరుముడిని ఇంత కష్టపడి ఖర్చు పెట్టి డబ్బింగ్ చేయిస్తే దానికి కనీస సపోర్ట్ దక్కడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చాక పెంచడం కాదు, రిలీజ్ రోజే తగినన్ని కేటాయిస్తే జనం ఆటోమేటిక్ గా వస్తారు. ఎక్కువ షోలు లేవని తెలిసినప్పుడు సహజంగానే ఆసక్తి సన్నగిల్లుతుంది. అన్నట్టు హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా తమిళనాడుకు చెందిన అమ్మాయే కావడం కొసమెరుపు.
This post was last modified on August 19, 2026 7:46 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…