Political News

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు తుందేమో కానీ.. ఆయ‌న‌కు మాత్రం ఎక్క‌డా విసుగ‌నిపించ‌దు!. అయితే.. ఇటీవ‌ల కాలంలో కొంత త‌గ్గించార‌నుకోండి. అయినప్ప‌టికీ మీడియా స‌మావేశాలు.. స‌భ‌ల్లో ఇప్ప‌టికీ.. మైకుపై చంద్ర‌బాబుయుద్ధ‌మే చేస్తున్నార‌ని త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతుంటారు. కాగా.. తాజాగా అంతర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు కెమెరా అందుకున్నారు. చిత్రంగా అనిపించినా నిజ‌మే!.

నిత్యం మీడియా మిత్రుల‌తో పిచ్చాపాటీ మాట్లాడ‌డ‌మే కాకుండా.. ప్రెస్‌మీట్లు నిర్వ‌హించే సీఎం.. కెమెరామెన్ల‌కు కూడా తల్లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్కించుకుని బుధ‌వారం సాయంత్రం త‌న‌ను క‌లిసి కెమెరామెన్లు(ఫొటో జ‌ర్న‌లిస్టులు), మీడియా ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఫొటో జ‌ర్న‌లిస్టుల నుంచి కెమెరా తీసుకుని త‌నే కొన్ని ఫొటోల‌ను క్లిక్ మ‌నిపించ‌డం విశేషం. ఇక్క‌డ మ‌రో చిత్రం ఏంటంటే.. నిత్యం త‌న ఫొటోలు తీసే కెమెరామెన్ల ఫొటోల‌ను చంద్ర‌బాబు తీయ‌డం!!.

సుమారు 20 నిమిషాల‌కు పైగా వివిధ కోణాల్లో జ‌ర్న‌లిస్టుల‌ను కూడా ఫొటోలు తీసి సంతోషం వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ ఫొటో గ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. చ‌రిత్ర‌ను రికార్డు చేయ‌డంతోపాటు.. అరుదైన జ్ఞాప‌కాల‌ను భ‌ద్ర‌ప‌రిచే ఫోటోగ్ర‌ఫీ వృత్తిలో ఉన్న‌వారికి అభినంద‌న‌లు అంటూ వ్యాఖ్యానించారు. ఫొటో జ‌ర్నలిస్టుల‌ అంకితభావం, కళాత్మక ప్రతిభ.. అంద‌రినీ ఆక‌ర్షిస్తాయ‌ని పేర్కొన్నారు. కాగా.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌ర్న‌లిస్టులు.. తాము ఫీల్డ్‌లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబుకు వివ‌రించారు. వీటిని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 

This post was last modified on August 19, 2026 7:53 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

38 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago