Movie News

వంశీ మార్కుతో అనిల్ రావిపూడి టైటిల్ ?

ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నా వినోదమే ప్రధానంగా సినిమాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొదట విన్నప్పుడు ఇదేం పేరు అనిపిస్తుంది. క్రమంగా అలవాటయ్యేకొద్దీ, స్క్రీన్ మీద మూవీ చూశాక ఇదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారుకి ఇదే స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌటయ్యింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ చిత్రానికీ ఇదే ఫాలో అవుతున్నారట.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ టైటిల్ లాక్ చేసినట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ త్వరలోనే ఈ లాంఛనం ఉండొచ్చని అంటున్నారు. ఇది వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ వంశీ. రాజేంద్రప్రసాద్ శోభన జంటగా ముప్పై అయిదేళ్ల క్రితం ఆయన తీసిన ఏప్రిల్ 1 విడుదల ఎంత కామెడీ క్లాసిక్ గా నిలిచిపోయిందో తెలిసిందే. మళ్ళీ అలాంటి తరహాలో ఇంకెవరూ టైటిల్ పెట్టే సాహసం చేయలేదు. ఇప్పుడు అనిల్ రిస్క్ తీసుకున్నారు.

దీంతో పాటు బామ్మర్ది బాల్ రెడ్డి, మరో అతి పొడవైన టైటిల్ అనుకున్నారట కానీ యూనిట్ నుంచి అధిక శాతం జనవరి 12 విడుదలకే ఓటేశారని వినికిడి. కథ ప్రకారం రాయలసీమ కుటుంబంలో జరిగే సరదా సంఘటనల ఆధారంగా అనిల్ చాలా హిలేరియస్ గా రాసుకున్నారని టాక్. ముఖ్యంగా బావ బావమరుదులుగా వెంకీ కళ్యాణ్ రామ్ కామెడీతో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి ఎపిసోడ్స్ విపరీతంగా నవ్వించేలా డిజైన్ చేశారని తెలిసింది. పేలితే మరోసారి బ్లాస్ట్ ఖాయం.

2027 సంక్రాంతికి విడుదల చేయాలని సంకల్పం పెట్టుకుని మరీ షూటింగ్ చేస్తున్న అనిల్ రావిపూడి ఎక్కడా తగ్గడం లేదు. ఒకవైపు సినిమా తీస్తూనే ప్రమోషన్లకు అవసరమైన ప్రోమో వీడియోలు కూడా షూట్ చేసుకుంటున్నారు. ఒక్కో పండక్కు ఒక్కో గిఫ్ట్ ఇచ్చేలా పక్కా ప్రణాళికతో ఉన్నారని సమాచారం. జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ అయిపోయింది. దీని కన్నా ముందు వెంకటేష్ నుంచి అక్టోబర్ 2 త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం థియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. 

This post was last modified on August 18, 2026 2:12 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

52 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago