ఫిలిం సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. కొందరు మీడియా వాళ్లకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చేస్తుంది. వాళ్లను ఏమైనా అడిగచేయొచ్చు అనుకుంటారు. తాము అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలనుకుంటారు. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రశ్నలు అడుగుతుంటారు. ముఖ్యంగా కేరళ జర్నలిస్టులు ఈ మధ్య సినిమా వాళ్లను అడుగుతున్న ప్రశ్నలు విడ్డూరంగా ఉంటున్నాయి.
ఇటీవల ఒక బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా మలయాళ నటి ప్రియ ప్రకాష్ వారియర్ కాషాయ రంగు దుస్తులు ధరిస్తే.. భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి ఈ డ్రెస్ వేసుకోవాలని మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేశారా అంటూ ప్రశ్నించాడు ఓ మీడియా ప్రతినిధి. ఇప్పుడు నేల టికెట్టు, రెడ్ సహా పలు చిత్రాల్లో నటించిన మహారాష్ట్ర నటి మాళవిక శర్మ.. మలయాళంలో తాను నటించిన తొలి చిత్రం ఖలీఫా ప్రమోషన్ కోసం కేరళకు వెళ్తే విచిత్రమైన ప్రశ్న అడిగాడు ఒక ఫిలిం జర్నలిస్టు.
మాళవిక ఫుడ్ హ్యాబిట్స్ గురించి ప్రశ్నలు అడిగే క్రమంలో మీకు బీఫ్ ఇష్టమా అని అడగడంతో ఆమె అవాక్కయింది. తాను శాఖాహారిని అంటూ ఆ సంభాషణకు అక్కడితో ముగింపు పలికింది మాళవిక. సంయమనంతో వ్యవహరించిన మాళవికపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఆ జర్నలిస్టుకు సోషల్ మీడియాలో గడ్డి పెడుతున్నారు. కేరళకు వచ్చే సెలబ్రెటీలందరికీ బీఫ్ గురించి ప్రశ్న అడగడం మాండేటరీనా అని ప్రశ్నిస్తున్నారు.
హిందువుల సెంటిమెంట్లను పట్టించుకోకుండా ఇలాంటి రెచ్చగొట్టే ప్రశ్నలు వేసే కేరళ జర్నలిస్టులు.. ఇతర మతస్థులను వారి సెంటిమెంట్లతో ముడిపడ్డ ప్రశ్నలను ఇంతే ధైర్యంగా అడగగలరా అని అడుగుతున్నారు. మాళవికను అడిగిన ప్రశ్న మీద జరుగుతున్న చర్చలోకి ప్రియ ప్రకాష్ వారియర్ కూడా రావడం విశేషం. తాను కాషాయ రంగు డ్రెస్ వేసుకుంటే దాని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్న అడిగారని, ఇలాంటి వాళ్లను లైట్ తీసుకోవాలని ఆమె కామెంట్ చేసింది.
This post was last modified on August 18, 2026 9:13 am
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…