కొత్త ఏడాది మొదలైంది. సినిమాల సందడికి తెర లేచింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ రేసులో నిలిచాయి. నూతన సంవత్సరం ఆరంభమైన సందర్భంగా, అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని కొత్త సినిమాల కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్‌లు, టీజర్ల మోత మోగుతోంది. మరోవైపు థియేటర్లలో మళ్లీ సందడి మొదలైన నేపథ్యంలో మున్ముందు పోటీ తీవ్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. అందుకే వేసవి బెర్తుల కోసం చకచకా కర్చీఫ్‌లు వేసేస్తున్నారు.
వకీల్ సాబ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు తోడు రంగ్ దె, టక్ జగదీష్, అరణ్య లాంటి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ డేట్లపై ఓ అంచనా వచ్చేసింది. ఈ సినిమాలన్నింటి గురించి మీడియాలో తరచుగా వార్తలొస్తున్నాయి. సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్ కూడా రాబోతోంది. ‘రాధేశ్యామ్’ టీజర్ కూడా అతి త్వరలోనే వస్తుందంటున్నారు.
ఐతే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న, పూర్తయిన సినిమాలన్నింటి గురించి ఏదో ఒక అప్ డేట్ ఉంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో ఒక డిస్కషన్ ఉంటోంది. కానీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న కొత్త చిత్రం గురించి మాత్రం చప్పుడే లేదు. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను వేసవికి విడుదల చేద్దామన్న ఆలోచన ఉందంటున్నారు. కానీ గత ఏడాది బాలయ్య పుట్టిన రోజుకు మినీ టీజర్ వదిలాక ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. టైటిల్, ఫస్ట్ లుక్ గురించి చర్చ లేదు. షూటింగ్ గురించి కూడా ఏ సమాచారం బయటికి రావట్లదేు.
ఈ చిత్రాన్ని వేసవికి ఫిక్స్ చేసినట్లయితే.. ఆ దిశగా మీడియాకు లీకులివ్వడమో లేదా అధికారిక ప్రకటన చేయడో చేయాలి. ఆ సీజన్లో సినిమాను దింపేట్లయితే.. బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతికి టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే ఇప్పట్నుంచో ప్రమోషన్‌కు ఉపయోగపడేది. సినిమా వార్తల్లో ఉండేది. కానీ ఇదేమీ లేకుండా సైలెన్స్ పాటిస్తోంది చిత్ర బృందం. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా.. అది ఏ దశలో ఉంది అనే సమాచారం కూడా లేదు. ముందు షూటింగ్ మీద పూర్తి ఫోకస్ పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్ సంగతి చూద్దామనుకుంటున్నారో ఏమో మరి.
This post was last modified on January 12, 2021 7:00 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…