Movie News

డిసి 100 కోట్ల లక్ష్యానికి విశ్వనాథ్ బ్రేక్ ?

గత వారం విడుదలైన డిసికి ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత ఫాలోయింగ్ ఉన్నా వేరొకరి డైరెక్షన్లో హీరోగా మెప్పిస్తాడానే అనుమానాలు బోలెడు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ డిసి ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వయొలెన్స్, రక్తపాతం, ఫైట్లు ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ వచ్చినప్పటికీ అవేవి జనాలను థియేటర్లకు రాకుండా ఆపలేదు. హిట్టు ముద్ర దాటేసింది.

వంద కోట్ల గ్రాస్ ఈజీగా అందుకుంటుందని భావిస్తున్న టైంలో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో డిసికి పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురయ్యింది. ఎందుకంటే ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉన్న డిసి ఆ మార్కు అందుకోవాలంటే మన ఆడియన్స్ మద్దతు తప్పనిసరి. అనూహ్యంగా సూర్య మూవీకి యునానిమస్ సపోర్ట్ దక్కడంతో వసూళ్లు క్రమంగా అటు వైపు షిఫ్ట్ అయిపోతున్నాయి. తక్కువ స్క్రీన్లు ఉన్న బిసి సెంటర్లలో సర్దుబాటు కింద డిసి షోలు తగ్గించి మరీ దానికి ఇవ్వాల్సి వచ్చింది.

ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర చోట్ల కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. రెండు జానర్లు వేర్వేరు అయినప్పటికీ థియేటర్ కౌంట్ ఎవరికి ఎక్కువ ఉన్నాయనే దాన్ని బట్టే వీకెండ్ వసూళ్లు వస్తాయి. ఈ విషయంలో విశ్వనాథ్ అండ్ సన్స్ దే పై చేయి అవుతుంది. ఒకవేళ దీనికి ఫ్లాప్ టాక్ వచ్చి ఉంటే ఆ అడ్వాంటేజ్ డిసి ఫుల్లుగా వాడుకునేది. పైగా పదో రోజు కొరియన్ కనకరాజు తిరిగి పుంజుకోవడం లాంటి కారణాలు ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం.

ఫైనల్ రన్ ఇంకా దగ్గర పడలేదు కానీ డిసికి ఈ సండే చాలా కీలకం కానుంది. ఎందుకంటే స్టార్ పవర్ లేని సినిమాలు రెండు వారాలు మించి హోల్డ్ చూపించలేవు. విశ్వనాథ్ అండ్ సన్స్ జోరు చూస్తుంటే ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు. రాబోయే రెండో వీకెండ్ కూడా నిలబడేలా ఉంది. నెక్స్ట్ వీక్ రవితేజ ఇరుముడి వచ్చేస్తుంది కాబట్టి డిసి ఆలోగా టార్గెట్ చేరుకోవాలి. ప్రస్తుతం ఎనభై కోట్ల దగ్గర ఉన్నట్టు ట్రేడ్ టాక్. ఇంకో ఇరవై కోట్లు వినడానికి ఈజీగా ఉంది కానీ కాంపిటీషన్ లో తెచ్చుకోవడం సులభం కాదు. 

This post was last modified on August 16, 2026 12:01 pm

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

1 hour ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

3 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

4 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

5 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

6 hours ago