Movie News

ఆగస్ట్ 15 మిలమిల… థియేటర్లు కళకళ

నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్ హడావిడి శనివారంతో మొదలవుతుంది. ఈసారి చిన్నా పెద్దా అందరికీ సెలవు రోజు కావడంతో థియేటర్లు నిండుగా కనిపించాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ ఏదో స్ట్రెయిట్ సినిమా అన్న రేంజ్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. సూర్య అంటే తమిళ హీరో కాదు మనవాడే అనుకునేలా కుటుంబ  ప్రేక్షకులు పోటెత్తారు. నిన్న సాయంత్రం నుంచే టికెట్లు దొరకడం కష్టమైంది.

ఇదొక్కటే కాదు ‘కొరియన్ కనకరాజు’ అనూహ్యంగా పుంజుకుని బుక్ మై షో ట్రెండింగ్ లోకి మళ్ళీ వచ్చేసింది. వారాంతం వినోదం కోరుకునే మాస్ జనాలకు ఇదే బెటర్ ఆప్షన్ అనిపిస్తోంది. దీంతో రెండో వారం కాబట్టి స్క్రీన్లు తగ్గింనా ఉన్నవాటిలో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. లోకేష్ కనగరాజ్ ‘డిసి’ కూడా ఇంచుమించు ఇదే స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. మల్టీప్లెక్సుల్లో పబ్లిక్ బాగా ఉండగా బిసి సెంటర్లు కూడా సగంపైనే ఆక్యుపెన్సీలు చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఊహించని విధంగా బాలీవుడ్ మూవీ ‘ఆవారాపన్ 2’ తెలుగు రాష్టాల్లోనూ బలంగా ఉంది. నిన్న హైదరాబాద్ లో చాలా చోట్ల టికెట్ ముక్క లేదు. ఇవాళ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఇమ్రాన్ హష్మీకి ఇంత క్రేజ్ ఉందాని ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఒక్క విశాల్ ‘మకుటం’ మాత్రమే ఎదురీదుతోంది. నెగటివ్ రివ్యూలు, వీక్ పబ్లిక్ టాక్ మొదటి ఆట నుంచే ప్రభావితం చేశాయి. కొన్ని చోట్ల దీని షోలు మిగిలిన వాటికి సర్దుబాటు చేశారు. కోలుకోవడం కష్టమేనని చెప్పాలి.

అన్నపూర్ణ స్టూడియెన్స్ వెనుక ఉండి నడిపించిన ‘పళ్ళబురుసు’కి ఓపెనింగ్, రెస్పాన్స్ రెండూ బలహీనంగానే ఉన్నాయి. హుషారు పిట్టలు చేసిన హడావిడి యూత్ ని ఆకర్షించి తక్కువే అయినా కనిపించదగ్గ నెంబర్లు అయితే నమోదు చేస్తోంది. అలాని టాక్ పాజిటివ్ గా లేదు. ఎంఎస్ రాజు ‘ఆగధ’కు హారర్ ప్రియులు కొంత అండగా నిలబడ్డా మిక్స్డ్ టాక్ వల్ల ఫైట్ చేయక తప్పడం లేదు. మొత్తానికి టయర్ 1 స్టార్లు లేకుండానే టాలీవుడ్ హాళ్లు ఇంత కళకళలాడటం చాలా మంచి పరిణామం.

This post was last modified on August 16, 2026 11:45 am

Share

Recent Posts

జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు భారీ ఊరట… తక్షణమే విధుల్లోకి!

నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…

20 minutes ago

మూణ్నెల్లు ఒకరినొకరు చూసుకోని విజయ్, రష్మిక

రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…

44 minutes ago

సూర్య 50… రోలెక్స్ అయ్యే ఛాన్సుందా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…

1 hour ago

నిర్మాత మాట… సినిమాలు ఊరికే ఆడట్లేదు

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్‌లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన…

2 hours ago

మూడేళ్ళ లోటుని ‘ఎపిక్’ తీర్చాలి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' సెప్టెంబర్ 11 విడుదల…

2 hours ago

ఛాలెంజుల మీద దృష్టి పెట్టిన ప్రేక్షకులు

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో…

3 hours ago