Movie News

వృషకర్మ: కుదిరితే దసరా.. లేదంటే..

నాగచైతన్య నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ మీద గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దసరా బరిలో ఉంటుందని ఒకసారి, కాదు వాయిదా పడిందని మరోసారి టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్‌కు దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఓ ఎండ్ కార్డ్ పెట్టేశాడు. వైజాగ్‌లో షూటింగ్ జరుగుతున్న గ్యాప్‌లో అక్కినేని ఫ్యాన్స్‌ను కలిసిన డైరెక్టర్.. సినిమా రిలీజ్ మీద ఓపెన్ గా క్లారిటీ ఇచ్చేశాడు.

టీమ్ ముందున్న మెయిన్ టార్గెట్ దసరానే అని కార్తీక్ చెప్పాడు. అయితే అది ముందే ఫిక్స్ చేసుకున్న డేట్ ఏమీ కాదు. మిథికల్ కథ కావడంతో సినిమాలో గ్రాఫిక్స్ చాలా కీలకం. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న క్వాలిటీతో టైమ్‌కి పూర్తయితే 90 శాతం దసరాకే వస్తామని స్పష్టం చేశాడు. ఒకవేళ విజువల్స్ విషయంలో ఇంకా టైమ్ పడుతుంది అనుకుంటే మాత్రం సినిమాను డిసెంబర్‌కు షిఫ్ట్ చేస్తామని ఎలాంటి దాపరికాలు లేకుండా ఫ్యాన్స్‌కు చెప్పేశాడు.

మామూలుగా అయితే పెద్ద సినిమాలకు ముందే డేట్ లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద ప్రెజర్ పెడుతుంటారు. కానీ ‘వృషకర్మ’ టీమ్ మాత్రం విజువల్స్ క్వాలిటీ చూసుకున్నాకే డేట్ ఫైనల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఒక భారీ సెటప్, మిస్టరీ టోన్ చూపించారు. ఆ మ్యాజిక్ థియేటర్లలో వర్కవుట్ అవ్వాలంటే గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే డేట్ కోసం సినిమా అవుట్ పుట్ ను పాడుచేసుకునే ఉద్దేశం మేకర్స్ కు లేదని ఈ మాటలతో అర్థమైపోతోంది.

ఇదే ఫ్యాన్స్ మీటింగ్ లో కార్తీక్ సినిమా స్కేల్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ముఖ్యంగా నాగచైతన్య అభిమానులకు కావాల్సిన ఒక కిక్కిచ్చే అప్డేట్ కూడా ఇచ్చాడు. సినిమాలో చైతూ టైటిల్ కార్డ్ పడేటప్పుడు ‘యువసామ్రాట్’ అనే ట్యాగ్ కచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని, అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ వైజాగ్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ సినిమాలో చైతూ అర్జున్ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ‘వృషకర్మ’ దసరాకి వస్తుందా అంటే.. రావాలనే టీమ్ గట్టిగా ట్రై చేస్తోంది. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం గ్రాఫిక్స్ అవుట్ పుట్ మీదే డిపెండ్ అయి ఉంది. లేదంటే డిసెంబర్.

This post was last modified on August 16, 2026 10:47 am

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

1 hour ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

3 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

4 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

5 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

6 hours ago