బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ వరల్డ్ నుంచి బయటకొచ్చాక ఆ హీరో క్రేజ్ ఎలా ఉంటుందనే చర్చ అప్పట్లో గట్టిగా నడిచింది. ప్రభాస్ ఎదుర్కొన్న ఆ పరిస్థితే ఇప్పుడు కన్నడ స్టార్ యష్ ముందు కూడా కనిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. నార్త్ మార్కెట్‌లో భారీ బిజినెస్ చేసినా ఓవరాల్‌గా సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ దక్కింది.
ఆ తర్వాత లవ్ స్టోరీగా వచ్చిన రాధేశ్యామ్, మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఆడియన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేశాయి. ప్రభాస్ క్రేజ్‌కు తగ్గ సరైన హిట్స్ పడలేదనే కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే వినిపించాయి. ఆ ఫ్లాపుల గ్యాప్‌లో సోషల్ మీడియాలో ప్రభాస్ సక్సెస్ అంతా కేవలం రాజమౌళి వల్లే వచ్చిందని కొన్ని వర్గాల నుంచి ట్రోలింగ్ కూడా ఎదురైంది. కానీ సలార్ సినిమాతో ప్రభాస్ తన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
ఆ వెంటనే వచ్చిన కల్కి 2898 ఏడీ ఆయన పాన్ ఇండియా బాక్సాఫీస్ స్ట్రెంగ్త్‌ను మళ్లీ చాలా పెద్ద స్థాయిలో ప్రూవ్ చేసింది. రాజమౌళి బ్రాండ్ లేకుండానే వేల కోట్ల వసూళ్లు రాబట్టాడు. అటు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సినిమాలతో యష్ తన మార్కెట్ దాటి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చి దాదాపు నాలుగేళ్లు దాటుతోంది. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో థియేటర్లలోకి యష్ అడుగుపెడుతున్నాడు.
ఈసారి ప్రశాంత్ నీల్ తోడు లేదు. ఆ రాకీ భాయ్ క్యారెక్టర్ కూడా లేదు. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో పూర్తిగా ఒక కొత్త క్యారెక్టర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అందుకే ఈ టాక్సిక్ రిజల్ట్‌పై కాస్త ఎక్కువ ఫోకస్ పడుతోంది. యష్ పాన్ ఇండియా స్టార్ పవర్‌కు ఇది ఒక మొదటి పెద్ద టెస్ట్. వేరే డైరెక్టర్, కొత్త ప్రపంచంలో కూడా తన పాత క్రేజ్ అలాగే క్యారీ చేయగలడా లేదా అనేది ఈ సినిమా బిజినెస్‌తోనే అందరికీ క్లియర్ గా తేలిపోతుంది.
యష్ స్టార్‌డమ్ కేవలం కేజీఎఫ్ లక్ వల్లే రాలేదని చెప్పడానికి ఈ మూవీ రిజల్ట్ చాలా అవసరం. కొత్త డైరెక్టర్‌తో చేసే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టిగా పెర్ఫార్మ్ చేస్తే, ఆయన సోలో మార్కెట్ పై వచ్చే కామెంట్స్ కు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఇక ప్రభాస్ ఆన్సర్ ఇచ్చినట్టే, యష్ కూడా తన సోలో స్టామినా చూపించాల్సి ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates