Movie News

కథ బయటికొచ్చినా ‘వారణాసి’కి నో టెన్షన్

బడ్జెట్ తో సంబంధం లేకుండా తన సినిమా ఏదైనా రాజమౌళి అనుసరించే పద్దతి ఒకటుంది. కథను దాచుకోరు. వీలైనంత ముందే బయట పెట్టేస్తారు. అది ప్రెస్ మీట్ కావొచ్చు లేదా ఏదైనా మీడియా ద్వారా కావొచ్చు. జనాలను ముందే ప్రిపేర్ చేయడం ఆయన స్టయిల్. మగధీర నుంచి ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు సైతం ఇదే ఫాలో అయ్యారు. చిన్న లీకుకే గజగజ వణికిపోయే ఎందరో దర్శకులు ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

వారణాసి బ్యాక్ డ్రాప్ కూడా ఇదే తరహాలో తెలిసిపోయింది. ఇది వర్తమానంలో జరిగే కథే. శాంభవి అనే గ్రహశకలం వారణాసిని ఢీ కొట్టేందుకు వేగంగా వస్తుంటుంది. ఇది పడితే ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని గుర్తించి రుద్ర (మహేష్ బాబు) అనే సాహస అన్వేషకుడిని పిలిపిస్తారు. ఖండ ఖండాలు దాటి ఒక కళారూపాన్ని తీసుకొచ్చే బాధ్యతని రుద్రతో పాటు చరిత్రను పరిశోధించే మందాకిని (ప్రియాంకా చోప్రా)కి అప్పజెబుతారు. వీళ్లకు తెలియకుండా కుంభ (పృథ్విరాజ్ సుకుమారన్) వెంటాడుతూ ఉంటాడు. ఈ విపత్తుకి పరిష్కారం రామాయణంలో ఉంటుంది. ఎలా ముడిపెట్టారనేది తెరమీద చూడాలి.

ఈ ప్లాట్ సమ్మరి స్కైబ్లూ సినిమాటిక్స్ అనే సైట్ లో పెట్టడం గమనార్హం. చూస్తుంటే లైన్ ఆసక్తికరంగానే ఉంది. మరీ కొత్తగా కాదు కానీ రాజమౌళి మార్క్ ట్రీట్ మెంట్, విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రుద్ర, కుంభ మధ్య జరిగే ఎపిసోడ్, రాముడు కుంభకర్ణుడి భీకర యుద్ధం చాలా స్పెషల్ గా ఉంటాయని టాక్. ఇండియా నుంచి అంటార్టికా మీదుగా ఆఫ్రికా దాటి ఎన్నో ఖండాలు వెళ్లే వారణాసి జంట చేసే సాహసాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయని టాక్.

వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న వారణాసి నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేలా టీమ్ తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ఎస్ఎస్ కార్తికేయ స్ట్రాటజీలు ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ టైంలో, రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. జనవరికంతా రీ రికార్డింగ్ పూర్తి చేస్తానని కీరవాణి ఇటీవలే చెప్పిన నేపథ్యంలో రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి వాయిదాలు ఉండవని అర్థమవుతోంది. జక్కన్న ఈసారి మాట తప్పరు. 

This post was last modified on August 8, 2026 2:18 pm

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

6 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

6 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

7 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

7 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

8 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

9 hours ago