‘బాహుబలి: ది కంక్లూజన్’కు ముందు నుంచి ఉన్న క్రేజ్.. ఆ సినిమా రిలీజయ్యే సమయానికి వచ్చిన హైప్.. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చరిత్రలో ఎన్నడూ చూడని వాతావరణాన్ని ఆ సినిమా విడుదల సందర్భంగా చూశాం. భవిష్యత్తులోనూ అలాంటి యుఫోరియా మరో సినిమాకు సాధ్యం కాదనే అనకున్నారంతా.
ఎందుకంటే మామూలుగా ఓ సినిమాకు అలాంటి హైప్ రావడం కష్టం. సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’కి ఇది కొనసాగింపు కావడం.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో సినిమాను ముగించడం వల్ల ‘ది కంక్లూజన్’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఇలాంటి హైప్ మరే సినిమాకూ పునరావృతం కాదని, బాక్సాఫీస్ దగ్గర సమీప భవిష్యత్తులో ఇంకో సినిమా ఇలాంటి వసూళ్లు రాబట్టడం అసాధ్యమని ట్రేడ్ పండిట్లు తేల్చేశారు. ‘బాహుబలి-2’ తర్వాత మూడున్నరేళ్లలో దాని దరిదాపుల్లోకి కూడా మరే సినిమా వెళ్లలేదు.
కానీ ఇప్పుడు ‘కేజీఎఫ్ చాప్టర్-2’కు కనిపిస్తున్న హైప్ చూస్తుంటే.. అది ‘బాహుబలి-2’కు దగ్గరగా వెళ్తుందేమో అనిపిస్తోంది. ‘చాప్టర్-1’ విడుదలకు ముందు ఆ సినిమాపై పెద్దగా అంచనాలేమీ లేవు. కన్నడేతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుంటే.. ఇక్కడ కన్నడ డబ్బింగ్ సినిమాను ఎవరు చూస్తారు అనుకున్నారు. కానీ ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-2’పై అంచనాలు మొదలయ్యాయి. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ అవి అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా టీజర్ చూశాక ఈ సినిమా కోసం జనాలు వెర్రెత్తిపోతున్నారని అర్థమవుతోంది. ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో వస్తున్న స్పందన అనూహ్యం.
రెండు రోజుల వ్యవధిలో 100 మిలియన్లకు పైగా వ్యూస్, 5 మిలియన్లకు పైగా లైక్స్ రావడమంటే అసాధారణ విషయం. ఇదేమీ పనిగట్టుకుని తెచ్చిన వ్యూస్, లైక్స్ కావు. జనాలు ఆసక్తితో ఇచ్చిన రికార్డులు. టీజర్ చూసి ప్రేక్షకులు స్పందిస్తున్న తీరు, వాళ్ల ఎగ్జైట్మెంట్ చూస్తుంటే.. ‘బాహుబలి-2’కి దీటుగా ఈ సినిమా హైప్ తెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇంకా హైప్ పెరిగేలా ప్రమోట్ చేసి, మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేస్తే, బాక్సాఫీస్ దగ్గర కూడా ‘బాహుబలి-2’ను మ్యాచ్ చేసేలా వసూళ్ల మోత మోగించే అవకాశాలున్నాయి.
This post was last modified on January 10, 2021 12:23 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…