నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా తెగ ప్రచారం చేస్తున్న రామాయణ బృందం దానికి తగ్గ ప్రమోషనల్ స్ట్రాటజీ పాటించడం లేదు. పది రోజుల క్రితం దేశవ్యాప్తంగా మీడియాని ముంబైకి పిలిపించి ట్రైలర్ రిలీజ్ చేశారు. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఈవెంట్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు జూలై 24 ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించి హఠాత్తుగా వాయిదా వేశారు. ఏవేవో కారణాలు చూపించారు కానీ అవేవీ అభిమానులకు కన్విన్సింగ్ గా అనిపించలేదు.
మొదటి రోజే ట్రైలర్ లీక్స్ రాగా తాజాగా పైరసీ రూపంలో సెల్ ఫోన్ తో తీసిన క్లిప్పులు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అందులో కీలకమైన షాట్స్ ఉన్నాయి. రావణుడి మీదకు పులి వచ్చినప్పుడు యష్ గర్జించడం, అడవిలో తారసపడిన బ్రహ్మ రాక్షసుడిని రాముడు ఎదిరించడం, శూర్పణఖగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ముక్కును లక్ష్మణుడు కోసేయడం ఇలా ముఖ్యమైన ఫుటేజ్ అంతా ఎక్స్, ఇన్స్ టాలో వైరలవుతోంది. కాపీ రైట్స్ వేసేలోపే లక్షల్లో చూస్తున్నారు.
వీలైనంత త్వరగా రామాయణ టీమ్ కళ్ళు తెరవాలి. ఎందుకంటే స్పష్టత లేకుండా వచ్చిన పైరసీ క్లిప్స్ లో క్వాలిటీ చాలా దారుణంగా ఉంది. వాటి ఆధారంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ తిప్పుతున్న వాళ్ళు లేకపోలేదు. అసలే ఇది బాలీవుడ్ కు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. బాహుబలికి తమ సమాధానంగా చరిత్రలో నిలిచిపోతుందని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ పరిణామాలు జరగడం మంచిది కాదు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో పాటు 3డి థియేటర్లలో రామాయణ ట్రైలర్ వేస్తారని తెలిసింది.
ఇది పక్కన పెడితే రిలీజ్ డేట్ ఇప్పటికీ ప్రకటించలేదు. నవంబర్ 8 అని ముంబై వర్గాల్లో చెప్పుకుంటున్నారు కానీ బయ్యర్లు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని బట్టి ఆ వారంలో తాము రావాలా వద్దా అనే దాని కోసం ఇతర ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వేరే ప్యాన్ ఇండియా సినిమాలు రామాయణతో క్లాష్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో బజ్ మీద ప్రతికూల ప్రభావం పడకుండా ఉండాలంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి.
This post was last modified on July 28, 2026 4:57 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…