సినిమా టైటిల్.. చెన్నై లవ్ స్టోరీ. కథ అంతా కూడా చెన్నై నేపథ్యంలోనే నడుస్తుంది. సినిమాలో తమిళ నేటివిటీ టచ్ కూడా బాగానే ఉంటుంది. కోలీవుడ్ సీనియర్ దర్శకుడు పి.వాసు కూడా ఓ కీలక పాత్ర చేశారిందులో. కానీ ఇలాంటి సినిమాకు చెన్నై బాక్సాఫీస్‌లో ఏమాత్రం ప్రాధాన్యం దక్కిందో అని చూస్తే షాకవ్వక తప్పదు. అంత పెద్ద సిటీలో ఆదివారం రోజు కేవలం 11 షోలు ఇచ్చిన పరిస్థితి.
అలా అని ‘చెన్నై లవ్ స్టోరీ’కి చెన్నైలో సరైన స్పందన లేదా అంటే అదేమీ కాదు. ఈ 11 షోలకూ అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి. తెలుగు వాళ్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఈ సినిమా చూసేందుకు ఉత్సాహంతో ఉన్నా.. ఎక్కువగా షోలు అందుబాటులో లేకపోవడంతో నిరాశ తప్పలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ప్రస్తావిస్తే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ నిర్మాత ఎస్కేఎన్ ఏడుపు ఎమోజీలు పెట్టి తన నిస్సహాయతను తెలియజేశాడు.
ఓవైపు విజయ్ అనువాద చిత్రం ‘జననాయకుడు’కు తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్ల సినిమాల రేంజిలో స్క్రీన్లు ఇచ్చారు. గత గురువారం వందల థియేటర్లు, వేల షోలతో సినిమా రిలీజైంది. తర్వాతి రోజు ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నా ఇప్పటికీ విజయ్ మూవీకి పెద్ద సంఖ్యలోనే షోలు కొనసాగుతున్నాయి. కానీ అదే సమయంలో తమిళనాట మాత్రం మొత్తం స్క్రీన్లను విజయ్ చిత్రానికే ఇచ్చేశారు. ‘చెన్నై లవ్ స్టోరీ’కి మినిమం స్క్రీన్లు, షోలు ఇవ్వలేదు.
తమిళ ప్రేక్షకులు వచ్చి మన సినిమాను చూసేస్తారన్న ఆశలు ఎలాగూ లేవు. కనీసం చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ల కోసం అయినా సరిపడా స్క్రీన్లు, షోలు ఇవ్వకపోవడమే అన్యాయం. ఇదే విషయమై ‘చెన్నై లవ్ స్టోరీ’ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనం తమిళ డబ్బింగ్ చిత్రాలను అంతగా సెలబ్రేట్ చేస్తాం.. కానీ మన సినిమాకు తమిళనాడులో ఎందుకు కనీస స్థాయిలో కూడా స్క్రీన్లు ఇవ్వరని అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు.
తన ‘క’ సినిమాను తమిళంలోకి అనువాదం చేస్తే కేవలం ఐదు స్క్రీన్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్‌ను అడిగితే.. తాము థియేటర్లు ఇచ్చినా తమ ప్రేక్షకులు వచ్చి చూడరని తేల్చేశారన్నాడు. కానీ ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ని చూసే జనం ఉన్నా కూడా స్క్రీన్లు ఇవ్వని పరిస్థితి. కానీ మన వాళ్లు మాత్రం తమిళ అనువాద చిత్రాలను నెత్తిన పెట్టుకుని, పోటీలో తెలుగు సినిమాలున్నా సరే బోలెడన్ని స్క్రీన్లు, షోలు ఇవ్వడమే విడ్డూరం.
This post was last modified on July 27, 2026 3:26 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…