Movie News

సంక్రాంతి సినిమాలు.. టెన్షన్ టెన్షన్

థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటేనేమి.. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి తక్కువగా ఏమీ లేదు. ఎప్పట్లాగే ఈ సీజన్లో నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. ఐతే మామూలు రోజుల్లోనే నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. ఏ చిత్రానికీ సరిపడా థియేటర్లు దక్కవు. సంక్రాంతికి మిగతా సీజన్లతో పోలిస్తే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఓవరాల్‌గా ఈ సీజన్లో వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.

కానీ పోటీ ఎక్కువైపోతే ఒక్కో సినిమాకు దక్కే వసూళ్ల సంఖ్యలో కోత పడుతుంది. అందులోనూ సంక్రాంతికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమా పరిస్థితి దయనీయంగా ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మెజారిటీ వసూళ్లను లాగేస్తాయి. టాక్ తేడా ఉన్న సినిమాలు పక్కకు వెళ్లిపోతాయి. గత ఏడాది హిట్ టాక్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వసూళ్ల మోత మోగగా.. దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.

ఇక ఈ ఏడాది విషయానికి వస్తే పండక్కి పోటాపోటీగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు కానీ.. లోలోన నిర్మాతల్లో టెన్షన్ లేకపోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఒకప్పట్లా పరిస్థితులు లేవు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవట్లేదు. కరోనా విరామం తర్వాత ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు పూర్తి స్థాయిలో రావట్లేదు. దీనికి తోడు అందుబాటులో ఉన్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లను ఇంకా పున:ప్రారంభించలేదు. ఇందువల్ల ఓవరాల్ థియేటర్ల సంఖ్య తగ్గింది.

ఇక 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల ఇంతకముందుతో పోలిస్తే ఒక్కో సినిమాకు థియేటర్లు సగం సంఖ్యలోనే అందుబాటులో ఉన్నట్లు లెక్క. రెవెన్యూ కూడా సగమే వస్తుంది. ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపేవే. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే దాని పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర దయనీయంగా ఉంటుంది. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటం ఖాయం. మరి సంక్రాంతి చిత్రాల్లో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని గట్టెక్కుతుందో.. దేనికి నెగెటివ్ టాక్ వచ్చి దెబ్బ తింటుందో చూడాలి.

This post was last modified on January 9, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

42 minutes ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

9 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

12 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

13 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

13 hours ago