Movie News

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల ఆక్యుపెన్సీలు ఆందోళనకర స్థాయిలో తగ్గుతున్నాయి. వీకెండ్ దాకా గట్టిగా నిలబడితే చాలనుకుంటున్న తరుణంలో తెలుగు వెర్షన్ వర్కౌట్ కావడం అనుమానంగా ఉంది. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం జన నాయగన్ అన్ని వెర్షన్లు కలిపి ఫస్ట్ డే సుమారు 80 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు తెచ్చింది.

కానీ ఫ్యాన్స్ ఆశించింది వేరు. తలపతి మినిమమ్ వంద కోట్లతో అకౌంట్ ఓపెన్ చేస్తాడని ఎదురు చూశారు. అదే జరిగితే హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ కొనసాగేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇలా జరగడానికి కారణాలు సింపుల్. మొదటిది ఈ సినిమా భగవత్ కేసరికి పూర్తి రీమేక్ కాదని టీమ్ ఎంత నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ జనాలు తేలిగ్గా తీసుకున్నారు. ఆఖరికి అనిల్ రావిపూడిని దింపి మరీ ఇంటర్వ్యూ చేయించారు. అయినా కలిగిన ప్రయోజనం తక్కువేనని చెప్పాలి.

ముఖ్యంగా సెకండాఫ్ ని దర్శకుడు హెచ్ వినోత్ ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, క్లైమాక్స్ ని భరించలేని ప్రహసనంగా డిజైన్ చేయడం ఆడియన్స్ నుంచి నెగటివ్ రియాక్షన్లు తీసుకొచ్చాయి. యధాతథంగా తీసినా బ్లాక్ బస్టర్ అయ్యేదని, కేవలం రాజకీయ ప్రయోజనాలను వాడుకోవడం కోసం చేసిన ఛేంజెస్ ఇప్పుడు అసలుకే మోసం చేశాయని విమర్శకులు అంటున్నారు. వీరాభిమానులు, టీవీకే పార్టీ వర్గాలకు ఎలా ఉన్నా విజయ్ నచ్చుతాడు కానీ అందరికి కాదుగా.

విచిత్రంగా తమిళనాడులోనూ మెయిన్ సెంటర్స్ మినహాయిస్తే కింది కేంద్రాల్లో జన నాయగన్ ఆశించిన దూకుడు చూపించడం లేదు. హెచ్డి ప్రింట్ నెలల క్రితమే లీక్ కావడం ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. అదే ప్రింట్ ని మళ్ళీ తీసుకొచ్చి పైరసీ సైట్లలో పెట్టినా ఏమి చేయలేకపోవడం ఈ ఆన్ లైన్ భూతం ఎంత స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది. మూడు వందల కోట్లను ఎక్స్ పెక్ట్ చేస్తున్న వాళ్ళ ఆశలు జన నాయకుడు అంత ఈజీగా తీర్చేలా లేడు. అది జరిగితే గొప్ప అద్భుతమని చెప్పొచ్చు. ఇలాంటి సిచువేషన్ లోనూ ఒక ఊరట కలిగించే అంశం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల వరకు 2026 హయ్యెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న డబ్బింగ్ సినిమా జన నాయకుడు కావడం.

This post was last modified on July 24, 2026 4:01 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

1 hour ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

3 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

3 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

6 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

8 hours ago