Political News

తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవలి కాలంలో విమర్శల సుడిలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి త్వరలోనే పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే వస్తున్న మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే తరహా కౌంటర్ తో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పటిమాదిరిగానే… ఈసారి కూడా తాను పార్టీ మారడం లేదంటూ ఆయన ఓ బ్లైండ్ స్టేట్ మెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు.

టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంవించిన మల్లారెడ్డి… తెలుగు నేల విభజన తర్వాత అనివార్య కారణాలతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీలో ఉండగా ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి… తన శాఖకు సంబంధించిన వివరాల వెల్లడి సందర్భంగా తనదైన మార్కును సంపాదించుకున్నారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారు కూలిపోగా… మల్లారెడ్డి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ఓ సారి వార్తలు వినిపిస్తే.. మల్లారెడ్డి తన కుటుంబంతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని మరోమారు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వార్తలు వినిపించిన ప్రతి సారీ వాటికి వివరణలు ఇవ్వక తప్పడం లేదు మల్లారెడ్డికి. ఇప్పటికే పలు మార్లు ఈ వార్తలను నేరుగానే ఖండించిన మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే పని చేశారు. అంతేకాకుండా ప్రతిసారీ చెప్పినట్లుగానే ఆయన ఈసారి కూడా తాను పార్టీ మారడం లేదని, ఈ దిశగా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవేనని కూడా ఆయన తేల్చేశారు.

ఇక శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం కదా. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూనే… కేటీఆర్ భవిష్యత్తుపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన మల్లారెడ్డి.. కేటీఆర్ 125 ఏళ్ల పాటు జీవించాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని మల్లారెడ్డి… కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కూడా తాను కోరుకుంటున్నానని కూడా అన్నారు. మొత్తంగా పార్టీ మారతానంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించిన మల్లారెడ్డి… కేటీఆర్ కు అదిరేటి రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. 

This post was last modified on July 24, 2026 5:14 pm

Share

Recent Posts

రామాయణతో కాజల్ కి దక్కిందేమి లేదు..!

ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి కాజల్ అగర్వాల్. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే.. సినిమాలకు…

8 hours ago

ఆస్తి కోసం చెల్లిని పండగపూట గెంటేసిన కేటీఆర్

అదేం చిత్రమో కానీ... రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో…

9 hours ago

టాలీవుడ్ హీరోలు ‘సీన్’ చేసి ఉంటే

సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…

12 hours ago

పోల‌వ‌రంలో సేన మారాల్సిందే.. !

పోల‌వ‌రం జిల్లాలో తాజాగా జ‌రిగిన పరిషత్ ఎన్నికలలో జ‌న‌సేన పూర్తిగా ఇరుకున ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు జేజేలు…

12 hours ago

సౌండ్ లేని టపాసులిచ్చిన తెలుగు స్టార్లు

తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…

13 hours ago

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి…

13 hours ago