90వ దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమను ఏలిన బేనర్లలో ‘సూపర గుడ్ ఫిలిమ్స్’ ఒకటి. ఇటు తెలుగులో, అటు తమిళంలో భారీ చిత్రాల నిర్మాణంతో, మేజర్ హిట్లతో ఆ సంస్థ తన ఆధిపత్యాన్ని చాటింది. తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని లాంటి బ్లాక్ బస్టర్లు ఆ సంస్థ నుంచి వచ్చినవే. తమిళంలో ఇంకా పెద్ద హిట్లు అందించిన ఘనత ఆ సంస్థ సొంతం.
కుటుంబమంతా కలిసి చూసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఆ సంస్థ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ఐతే 2000 తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేక ఈ సంస్థ అధినేత ఆర్.బి.చౌదరి ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. దీంతో నెమ్మదిగా ఆయన జోరు తగ్గిపోయింది. ఒక దశ దాటాక సినిమాల నిర్మాణమే ఆపేశారు ఆర్.బి.చౌదరి. ఐతే ఈ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల నిర్మాణంలో బిజీ కావాలని చౌదరి నిర్ణయించుకున్నారు.
2021లో వరుసబెట్టి సినిమాలు తయాలని సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్ణయించుకుంది. ఈ వరుసలో తొలి సినిమాను అనౌన్స్ చేసింది. అది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోయే చిత్రం. దాని పేరు.. ఇష్క్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అనేది దీని ఉపశీర్షిక. ఇష్క్ పేరుతో ఇంతకుముందు నితిన్ హీరోగా ఎనిమిదేళ్ల కిందట తెలుగులో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కూడా.
పాత సినిమాల పేర్లను మళ్లీ వాడుకుని సినిమాలు తీయడం మామూలే కానీ.. కనీసం పదేళ్లయినా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కానీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తక్కువ గ్యాప్‌లోనే ‘ఇష్క్’ పేరుతో కొత్త సినిమా తీస్తోంది. ఓ బేబీ, జాంబీ రెడ్డి లాంటి సినిమాల్లో నటించిన ఒకప్పటి బాల నటుడు తేజ సజ్జా ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మలయాళ భామ ప్రియ ప్రకాష్ వారియర్ కథానాయిక. ఎస్ఎస్ రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. మరి సూపర్ గుడ్ వారికి రీఎంట్రీలో ఎలాంటి ఆరంభం లభిస్తుందో?
This post was last modified on January 8, 2021 10:19 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…