ఈసారి సంక్రాంతి రేసులో చివరగా రావాల్సిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ చిత్రం.. చివరగా జనవరి 15న విడుదలకు ముహూర్తం చూసుకుంది. కానీ ఇప్పుడు చిత్ర బృందం ఆలోచన మారినట్లుగా తెలుస్తోంది. ఒక రోజు ముందే, అంటే జనవరి 14న సంక్రాంతి రోజే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నారట. అంటే రామ్ మూవీ ‘రెడ్’కు ‘అల్లుడు అదుర్స్’ నుంచి పోటీ తప్పదన్నమాట.
ముందు అనుకున్న ప్రకారం అయితే మరో సంక్రాంతి సినిమా ‘క్రాక్’ జనవరి 14న రావాల్సింది. కానీ ఒకేసారి ఎక్కువ సినిమాలు పోటీ పడితే అన్నింటికీ నష్టమే అని.. ముందు సోలోగా రిలీజ్ చేసుకుని అడ్వాంటేజ్ పొందుదామని ఆ చిత్రాన్ని జనవరి 9కి ఫిక్స్ చేశారు. మిగతా సంక్రాంతి సినిమాలతో పోటీ లేకుండా ఐదు రోజుల పాటు సోలోగా బాక్సాఫీస్‌ను ఏలే అవకాశం ‘క్రాక్’కు వచ్చింది.
‘క్రాక్’ ముందుకు వచ్చేయడంతో.. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమాను ఒక రోజు ముందుకు తెస్తున్నారు. ఈ రోజుల్లో వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి. 14న పండుగ రోజు ఆటోమేటిగ్గా మంచి వసూళ్లు వస్తాయి. కాబట్టి ఆ రోజు తమ చిత్రాన్ని విడుదల చేస్తే ఒక రోజు అదనపు వసూళ్లు రాబట్టుకోవడానికి అవకాశముంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ వీకెండ్ అంతా మంచి వసూళ్లే వస్తాయి కాబట్టి.. సోమవారం నుంచి సినిమా సంగతి ఏమైనా పర్లేదని అనుకుని ఉండొచ్చు.
ఈ సినిమా ముందుకు రావడం వల్ల ‘రెడ్’ ఓపెనింగ్ డే వసూళ్లపై కొంత ప్రభావం ఉంటుంది. ఇక తమిళ డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’ వసూళ్లపైనా ఈ చిత్రం ప్రభావం చూపే అవకాశముంది. 14వ తేదీ దానికి ‘అల్లుడు అదుర్స్’ నుంచి పోటీ ఎదురవడమే కాదు.. దాని కోసం కేటాయించిన స్క్రీన్లను ఒక రోజు ముందే ఇచ్చేయాల్సి ఉంటుంది.
This post was last modified on January 8, 2021 10:15 pm
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…