Movie News

ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా ఎలా అవుతుంది నోలన్ సారు

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గ్లోబల్ సినిమాలో ఇండియన్ యాక్టర్స్ గుర్తింపు గురించి మాట్లాడుతూ ఆయన ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తెచ్చారు. కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల సక్సెస్ ను చూస్తే, ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ అమెరికన్ మార్కెట్ లోకి బ్రేక్ అవుట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ విషయమని నోలన్ తెలిపారు.

నోలన్ నోటి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాను ‘బాలీవుడ్’ అని అనడంపై తెలుగు సినిమా అభిమానులు సోషల్ మీడియాలో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ అనేది పక్కా టాలీవుడ్ (తెలుగు) సినిమా అని, దానిని బాలీవుడ్ ఖాతాలో వేయడం ఏంటంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన ఒక ప్రాంతీయ సినిమా మూలాలను సరిగ్గా మెన్షన్ చేయకపోవడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ సినిమా ప్రముఖులు భారతదేశంలో తయారయ్యే ప్రతి సినిమాను బాలీవుడ్ గానే భావించే పాత పద్ధతిని ఇంకా మార్చుకోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు టాలీవుడ్ రేంజ్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటికీ వాటిని హిందీ సినిమాల కిందే చూడటంపై సౌత్ ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ మేకర్స్ కు ఇండియన్ ఇండస్ట్రీల విభజనపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు.

అయితే ఈ వివాదాన్ని పక్కన పెడితే, ఆర్ఆర్ఆర్ సాధించిన గ్లోబల్ సక్సెస్ ను నోలన్ లాంటి పెద్ద డైరెక్టర్ గుర్తించడాన్ని కొందరు సినిమా లవర్స్ పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అమెరికన్ మార్కెట్ లో ఇండియన్ సినిమాలకు ఉన్న స్కోప్ ను ఆర్ఆర్ఆర్ ఎలా పెంచిందో నోలన్ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ పేరు ఏదైనా, భారతీయ సినిమా పవర్ ను హాలీవుడ్ ఒప్పుకుందనే పాయింట్ ను ఇక్కడ గమనించాలని చెప్తున్నారు.

This post was last modified on July 20, 2026 5:45 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

25 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

54 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago