Movie News

మూడో పొలిమేర… ఇంకా పెద్దగా?

కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్‌ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు అనిల్ విశ్వనాథ్. అది ఓటీటీలో నేరుగా రిలీజై అనూహ్య స్పందన తెచ్చుకుంది. రాను రాను వ్యూస్ పెరిగి డిజిటల్‌గా బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. 

దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి ‘పొలిమేర-2’ తీశారు మేకర్స్. అది థియేటర్లలో బాగా ఆడి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి సినిమా ఇంకా పెద్ద రేంజిలో తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సత్యం రాజేష్ ఎప్పట్లాగే లీడ్ రోల్‌లో కొనసాగనుండగా.. ఇతర ముఖ్య పాత్రలూ కొనసాగబోతున్నాయి. ఈ చిత్రానికి ఇప్పుడు ఇంకో స్పెషల్ అట్రాక్షన్ తోడైంది.

సీనియర్ నటుడు, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన అర్జున్ సర్జా ‘పొలిమేర-3’లో కీలక పాత్ర పోషించనున్నాడట. రెండు నెలల ముందైతే అర్జున్ ఈ చిత్రంలో నటిస్తున్నాడంటే ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ అయ్యేవాళ్లు కాదు. కానీ ‘బ్లాస్ట్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అర్జున్. ఇప్పుడాయనకు డిమాండ్ పెరిగింది. 

ఇలాంటి టైంలో ఆ నటుడిని ‘పొలిమేర-3’ కోసం లాక్ చేసి తమ సినిమాకు హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టీం. ‘పొలిమేర-2’ చివర్లో పార్ట్-3కి ఇచ్చిన లీడ్ చూస్తే ఈ సినిమా భారీగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇలా ఓటీటీలో రిలీజైన ఓ చిన్న సినిమా ఇప్పుడు ఇంత పెద్ద రేంజికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి మూడో భాగంలో అనిల్ అండ్ టీం ఇంకెంత థ్రిల్ చేస్తుందో చూడాలి.

This post was last modified on July 19, 2026 6:05 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

8 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

14 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

29 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

56 minutes ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago