Movie News

గ్రీన్ డ్రెస్ లో రాశీ గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి క్యూట్ గా కనిపిస్తూనే కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ ను పలకరించే ఈ బ్యూటీ, లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలలో రాశీ సింగ్ డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించింది. ఎక్కడా తన డీసెంట్ గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. స్లీవ్ లెస్ లాంగ్ గౌన్ లో ఆమె ఇచ్చిన ఫోజులు, ముఖ్యంగా ఆ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్లకు కనెక్ట్ అవుతున్నాయి. సింపుల్ మేకప్ కు సెట్ అయ్యేలా వేసుకున్న నెక్లెస్ ఆమె అందాన్ని మరింత పెంచింది. బ్యాక్ సైడ్ తిరిగి ఇచ్చిన స్టైలిష్ పోజ్ ఈ ఫోటోషూట్ లోని విజువల్స్ కే హైలైట్ గా నిలిచింది.

కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా తన యాక్టింగ్ స్కిల్స్ తో కూడా రాశీ సింగ్ ఆడియన్స్ కు దగ్గరవుతోంది. శశి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈమె, ఆ తర్వాత ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పాత్రలకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పిస్తూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది. పాపం పసివాడు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లలో కూడా తన నటనతో అలరించింది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి సక్సెస్ అయితే ఆమె కెరీర్ కు మంచి బూస్ట్ దొరికినట్లే. లుక్స్, యాక్టింగ్ టాలెంట్ రెండూ ఉన్న ఇలాంటి హీరోయిన్లకు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ పడితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన క్యూట్ ఫోటోలతో ఆడియన్స్ తో టచ్ లో ఉండే రాశీ సింగ్, రాబోయే ప్రాజెక్ట్స్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. 

This post was last modified on July 18, 2026 11:15 pm

Page: 1 2

Share

Recent Posts

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

31 minutes ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

1 hour ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

1 hour ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

3 hours ago