రవితేజ క్రాక్ సినిమాకు ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాలలో క్రేజ్ బాగానే వుంది. ఎందుకంటే నాలుగు ఫ్లాపుల తర్వాత కూడా ఈ చిత్రానికి కరోనా సమయంలో, సగం టికెట్లే అమ్మాల్సిన రూలు అమల్లో వున్న వేళ చాలా మంచి బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు పద్ధెనిమిది కోట్లు వచ్చాయి. రవితేజ గత నాలుగు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా పది కోట్ల షేర్ రాబట్టలేకపోయాయి. దీనిని బట్టి క్రాక్‍ని ట్రేడ్ ఎంత గట్టిగా నమ్ముతుందనేది అర్థమవుతోంది.
ఈ సినిమా ట్రెయిలర్‍కు కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి. పాటలకు కూడా స్పందన బాగానే వుంది. అయితే అదంతా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కనిపించడం లేదు. సినిమాలకు జనం మొహం వాచిపోయి వున్నారని అందరూ నమ్ముతోన్న టైమ్‍లో ఇది మంచి పరిణామం కాదు. అందులోను ఈ చిత్రం శుక్రవారం కాకుండా వీకెండ్ చూసుకుని శనివారం రిలీజ్ అవుతోంది. బహుశా రవితేజ ఇటీవలి కాలంలో చేసిన సినిమాల ఎఫెక్టు కూడా కావచ్చు లేదా మల్టీప్లెక్స్ ల సినిమా కాదనే భావన అయివుండొచ్చు. ఏదేమైనా క్రాక్ టాక్ తెచ్చుకుంటే తప్ప పండక్కి ముందొచ్చిన అడ్వాంటేజ్‍ని క్యాష్ చేసుకోడం కష్టం కావచ్చు.
This post was last modified on January 8, 2021 2:06 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…