రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్ మెగాస్టార్ అనేశారు. చరణ్ బ్లాక్ బస్టర్లు చూడటం కొత్త కాదు కానీ ఇంత కష్టపడి ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించడం కోసం పడిన తపన చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. తెలుగు కాకుండా బయట రాష్ట్రాల్లో ఆశించిన వసూళ్లు రానప్పటికీ మూడు వందల కోట్లు దాటడమంటే అక్కడ సింహభాగం పనిచేసింది రామ్ చరణ ఇమేజే. ఆర్సి 17 మీద అంచనాలు అప్పుడే హైలో ఉన్నాయి.
అఖిల్ తాజాగా లెనిన్ తో హిట్టు కొట్టాడు. సంవత్సరాలు గడిచిపోతున్నా చేతిలో బ్లాక్ బస్టర్ లేక అభిమానులను కలవరానికి గురి చేస్తూ ఫైనల్ గా సక్సెస్ అందుకున్నాడు. మొన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున, అఖిల్ ఎమోషన్ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం కెమెరాల సాక్షిగా రికార్డయ్యింది. నాగచైతన్య సెటిలయిపోయాడు కాబట్టి నాగ్ కు తన విషయంలో టెన్షన్ లేదు. అయితే అఖిల్ తొలి అడుగులే సరిగా పడకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ని బాధించింది. ఇప్పుడా కొరత తీరింది.
వెంకటేష్ వారసుడి డెబ్యూ గురించి అప్పుడే కథనాలు వస్తున్నాయి. కుర్రాడి లుక్స్ కూడా బయటికి రానంత గోప్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ అతన్ని ఉన్నత చదువులు చదివిస్తోంది. ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటే చాలు రంగం సిద్ధం చేయడానికి సురేష్ బాబు, రానా రెడీగా ఉన్నారు. సీనియర్లలో ఇక మిగిలింది బాలకృష్ణ. అదిగో ఇదిగో అనడం తప్ప మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం రావడం లేదు. ఇదో అంతు చిక్కని రహస్యంగా మారింది.
మొదట ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో భారీ చిత్రం అన్నారు. ఓపెనింగ్ ముందు రోజు ఆపేశారు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్ ప్రచారం జరిగింది. అదీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సందీప్ వంగా పేరుని ఎవరో ప్రచారంలోకి తెచ్చారు. ఇది పచ్చి పుకారు. అసలు కుర్రాడికి నటన పట్ల ఆసక్తి ఉందో లేదోననే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి కానీ తగ్గడం లేదు. బాలయ్య స్వయంగా ఏదైనా క్లారిటీ ఇస్తే బెటర్. మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి, హిట్లు కొట్టి, ఆ పుత్రోత్సాహాన్ని బాలయ్య అనుభవిస్తుంటే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కోరిక. మరి ఎప్పుడు తీరుతుందో.
This post was last modified on July 14, 2026 9:28 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…