Movie News

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. మొదట దసరా రిలీజ్ అనుకున్నారు కానీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందులోనూ పండగను టార్గెట్ చేసుకుని జైలర్ 2 వస్తోంది. దాని పోటీకి భయపడినా పడకపోయినా వృద్ధి బ్యానర్ సోలో రిలీజ్ వైపు చూస్తోంది. అందుకే డిసెంబర్ మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నట్టు సమాచారం.

అభిమానులు సాధారణంగా బాలయ్య సినిమాని సంక్రాంతికి ఆశిస్తారు. అయితే ఈసారి కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉండబోతోంది. చిరు బాబీ మూవీ, రవితేజ శ్రీవిష్ణు సినిమా, శర్వానంద్ కొత్త చిత్రం, వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో ఇలా పండగ బరిలో చాలా రష్ ఉంది. ఎవరిది ఎలా ఉన్నా బాలకృష్ణకు తనకంటూ స్పేస్ ఉంటుంది కానీ ఓపెనింగ్స్, కలెక్షన్లను ఇతర హీరోలతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకనుకుంటే డిసెంబర్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఉండదు.

గతంలో అఖండ ఇదే నెలలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది. అఖండ 2 కూడా వచ్చింది కానీ ఆశించిన ఫలితం దక్కపోవడం వేరే విషయం. ఎంతసేపూ సంక్రాంతి కోసమే చూడకుండా రెవిన్యూ భారీగా వచ్చేలా ఉన్న ఇతర డేట్లను పరిశీలించే పనిలో టీమ్ ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ ఫౌజీ రాక గురించి వార్తలు తిరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఆ ప్యాన్ ఇండియా మూవీ కనక వచ్చే పనైతే ఎన్బికె 111 ఏం చేయాలనే దాని మీద కూడా సమాలోచనలు జరుగుతున్నాయి.

ఇవి మరికొన్ని రోజుల్లో కొలిక్కి రావొచ్చు. ముంబై బ్యాక్ డ్రాప్ లో మాఫియా డాన్ గా బాలయ్య ఇందులో కనిపిస్తారని వినికిడి. అయితే రెగ్యులర్ గా చూసిన తరహాలో కాకుండా సరికొత్త క్యారెక్టరైజేషన్ ఉంటుందట. డ్యూయల్ రోల్ కాదు కానీ బాలకృష్ణ పాత్రకు పెట్టిన షేడ్స్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని ఊపేయడం ఖాయమని అంతర్గతంగా వినిపిస్తోంది. టైటిల్ లాంచ్ త్వరలోనే చేయబోతున్నారు. సినిమాలో హీరో పేరునే దాదాపు ఫిక్స్ చేశారట. అదేంటనేది ఇంకా లీక్ కాలేదు.  

This post was last modified on July 13, 2026 5:25 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago