వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్ 7 విడుదల కాబోతున్న ఈ హారర్ కామెడీ ఇప్పటికే పలు వాయిదాలు చవి చూసింది. యువి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా కమెడియన్ సత్య మరోసారి నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నాడు. హీరోలాగే దర్శకుడు మేర్లపాక గాంధీకి ఈ మూవీ సక్సెస్ చాలా కీలకం. ఇవాళ టీజర్ లాంచ్ జరిగింది.
రాయలసీమ పెనుగొండ ప్రాంతంలో జల్సాగా తిరిగే కుర్రాడు కనకరాజు (వరుణ్ తేజ్). ఓసారి సీమకు వచ్చిన ఓ అమ్మాయి (రితిక నాయక్) ని చూసి మనసు పారేసుకుంటాడు. కానీ ఆమె కొరియా దేశం నుంచి వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే తనతో పరిచయం మొదలయ్యిందో అక్కడి నుంచి కనకరాజులో విపరీతమైన మార్పులు వస్తాయి. అర్థం కాని వేషభాషల్లో విన్యాసాలు చేస్తుంటాడు. ఏకంగా సూటు బూటు వేసుకుని కొరియాలో ప్రత్యక్షమవుతాడు. ఎందుకనేది తెరమీద చూడాలి.
మొన్నటిదాకా ప్రయోగాలంటూ తనకు నప్పని జానర్లు ఎంచుకున్న వరుణ్ తేజ్ ఈసారి పూర్తిగా రూటు మార్చేశాడు. మాస్ తో పాటు క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సబ్జెక్టు ఎంచుకున్నాడు. హాస్యానికి ఎక్కువ అవకాశం ఉండటంతో గద్దలకొండ గణేష్ తరహాలో ఇందులో కూడా మంచి ఫన్ ప్లస్ యాక్షన్ ఉండొచ్చేమో. అయితే హారర్ సబ్జెక్టు కాబట్టి దెయ్యాలు సంబంధించిన అంశాలతో పాటు మేర్లపాక గాంధీ మార్కు ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటాయని యూనిట్ టాక్.
ఈ వారం నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న కొరియన్ కనకరాజు ఖచ్చితంగా వరుణ్ తేజ్ కి కంబ్యాక్ అవ్వాల్సిందే. ఘాటీ డిజాస్టర్, కపుల్ ఫ్రెండ్లి డీసెంట్ ఫలితం, బైకర్ కమర్షియల్ ఫైయిల్యూర్ చూసిన యువి సంస్థకు ఈ ప్రాజెక్టు చాలా కీలకం. సక్సెస్ అయ్యిందా నెక్స్ట్ లైన్ లో ఉన్న చిరంజీవి విశ్వంభరకు మరింత బూస్ట్ దక్కుతుంది. రెండు మెగా ఫ్యామిలీ మూవీస్ వరసగా లైన్ లో పెట్టిన యువి ఎలాంటి ఫలితాలు అందుకోనుందో చూడాలి.
This post was last modified on July 13, 2026 5:46 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…