విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది. రెండో భాగం షూటింగ్ మొదలయ్యాక ఇవి మరోసారి ఊపందుకున్నాయి. ముఖ్యంగా కర్ణుడి పాత్ర, దాన్ని క్లైమాక్స్ లో చూపించిన విధానం మీద ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ఓపెన్ గానే దీని గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒక నెటిజెన్ ట్వీట్ కు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
తాను ఏం చెబుతున్నానో తనకు స్పష్టత ఉందని, కర్ణుడిని శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు పొగిడాడో గూగుల్ లో వెతికి చూసుకోమని చెప్పడం సర్వత్రా చర్చకు దారి తీసింది. వివేక్ దేబ్ రాయ్ రాసిన అనువాదాన్ని చదివితే మరింత క్లారిటీ వస్తుందని రచయిత పేరుతో సహా రిఫరెన్స్ ఇచ్చేశారు. సీక్వెల్ వచ్చాక అప్పుడు చూసి కామెంట్ చేస్తే బాగుంటుంది కానీ, ముందే ఊహాగానాలకు చోటివ్వడం ద్వారా లేనిపోని వివాదాలకు దారి తీస్తుందని గుర్తించిన నాగ్ అశ్విన్ ఈ సమాధానం చెప్పారనుకోవాలి.
నిజానికి కర్ణ గురించి డిస్కషన్ ఇప్పటిది కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలో కవచకుండలధారి గురించి ఎంత గొప్పగా చూపించారో చరిత్ర మర్చిపోలేదు. అంత అద్భుతంగా ఆ పాత్రకు అన్నగారు ప్రాణ ప్రతిష్ట చేశారు. శివాజీగణేశన్ కోరిమరీ రీమేక్ చేసుకోవడం ఇంకో విశేషం. అయితే కర్ణుడు అంత మంచివాడు కాదు, దుర్యోధనుడి పంచన చేసి ఎన్నో తప్పులు చేశారని వాదించే వర్గాలు లేకపోలేదు. వ్యాస మహాభారతం లోతుకు వెళ్తే తప్ప ఇవన్నీ అర్థం కావు.
కల్కి 2 రిలీజ్ ఇప్పుడప్పుడే లేదు. ఎందుకంటే ఫౌజీ కనక ఈ డిసెంబర్ లో వస్తే మార్చిలో స్పిరిట్ దిగుతుంది. ఈ రెండింటిలో ఏది వాయిదా పడినా 2027లో ఈ రెండు సినిమాలతో సరుకోవాల్సి ఉంటుంది. అంటే కల్కి 2 అటుపై సంవత్సరం 2028లో ఆశించవచ్చు. అది కూడా నాగ్ అశ్విన్ విఎఫ్ఎక్స్ మీద సంతృప్తి చెంది ఫైనల్ కాపీ వంద శాతం బెస్ట్ అని ఫీలైతే తప్ప. సో అప్పటిదాకా ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి. రెండో భాగంలో కర్ణుడి పాత్ర మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని వినికిడి.
This post was last modified on July 13, 2026 12:18 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…