Movie News

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను సంతోషంలో ముంచెత్తింది. అలాని దీనికి శాశ్వత పరిష్కారం దొరికిందని కాదు కానీ ఉన్నంతలో తొలి వీకెండ్ వరకు ఈ గండం నుంచి తప్పించుకోవడం కలెక్షన్ల పరంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే చాలా కింది స్థాయి బిసి సెంటర్స్ లో ఈ పైరసీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే సినిమాలు చూసే బాపతు వీటి మీదే ఆధారపడతారు.

లెనిన్ విషయంలో ఎక్కడ జాగ్రత్త తీసుకున్నారనే దాని మీద నిర్మాతలు పాటించిన స్ట్రాటజీ మీద ఇతరులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిర్మాత నాగవంశీ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు రిలీజ్, సెన్సార్ కోసం ప్రింట్లు పంపినప్పుడు వాటి ద్వారా పైరసీ జరిగే అవకాశం ఉందని చెప్పారు. లెనిన్ ఈసారి అక్కడ విడుదల కాలేదు. అంటే ఈ కారణం వల్లే లెనిన్ మొదటి వీకెండ్ ని పైరసీ లేకుండా తప్పించుకుందానే డౌట్ వస్తోంది.

అలాని ఇదేమి పూర్తిగా సంతోషపడే విషయం కాదు. ఎందుకంటే పైరసీ ఒక్క దేశంలోనో ఒక వ్యక్తి వల్లనో కావడం లేదు. రూపాలు మార్చుకుని ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తోంది. ఆ మధ్య ఇబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇక పైరసీ బెడద టాలీవుడ్ కు ఉండదనే రేంజ్ లో హడావిడి జరిగింది. తీరా చూస్తే పెద్ది లాంటి ప్యాన్ ఇండియా మూవీ సైతం దీని బారిన పడింది. తెలుగు ఒకటే కాదు హిందీ తమిళ మలయాళ అన్ని పరిశ్రమలకు ఈ చీడపురుగు వల్ల నష్టాలు వస్తూనే ఉన్నాయి.

కొన్ని నెలల క్రితం ఈటీవీ విన్ సంస్థ పైరసీని నిలువరించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఒక దశలో విజయం సాధించి తమ కంటెంట్ వెంటనే ఆన్ లైన్ కాకుండా కాపాడుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ షరామామూలే. సినిమాల్లో చూపించినట్టు హీరో కన్నా విలన్ అడ్వాన్స్డ్ గా ఆలోచించినట్టు నిర్మాతకన్నా పైరసీ చేసేవాళ్ళే తెలివిగా ఎత్తుగడలు వేస్తున్నారు. దశాబ్దాల తరబడి మహమ్మారిలా అంటుకున్న ఈ పైరసీ భూతం ఎప్పటికి చనిపోతుందో అంతు చిక్కని రహస్యంగా మిగిలింది. 

This post was last modified on July 13, 2026 11:04 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago