సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టనుంది. ఇండియన్ మార్కెట్ నుంచి సుమారుగా 75 కోట్లకు పైగా వసూలు కాగా ఓవర్సీస్ నుంచి 24 కోట్లకు దగ్గరగా వెళ్లిందని ట్రేడ్ టాక్. బాలన్స్ ఉన్న లక్షలు ఇవాళ్టితో అయిపోతాయి. లెనిన్ కు పాజిటివ్ టాక్ రావడం వల్ల వీకెండ్ కొంత ఎఫెక్ట్ అయినా తనకంటూ ఉన్న ఆడియన్స్ ఈ వారాంతంలో కూడా అండగా నిలవబోతున్నారు.
లెనిన్ బాక్సాఫీస్ స్పీడ్, ఈవిల్ డెడ్ బర్న్ కు మల్టీప్లెక్సుల మద్దతు, ఢమాల్ 4 దక్కించుకున్న స్క్రీన్లు వగైరా అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ మా ఇంటి బంగారం గత ఇరవై నాలుగు గంటల్లో 13 వేల టికెట్లను బుక్ మై షోలో అమ్మడం చూస్తే సామ్ స్టార్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ది ఓటిటిలో రాకముందే సెలవు తీసుకోవడంతో ఆ అడ్వాంటేజ్ సమంత టీమ్ ఫుల్లుగా వాడుకుంటోంది. నెల రోజులకు దగ్గరగా ఉన్నా ఇంత స్టడీగా ఉండటం మాములు విషయం కాదు.
ఫైనల్ రన్ వైపు పరుగులు పెడుతున్న మా ఇంటి బంగారం చివరికి ఏ నెంబర్ తో క్లోజ్ అయినా అది సరికొత్త రికార్డుగా నిలవనుంది. మహానటి గతంలో 90 కోట్ల దగ్గరకు వెళ్లి ఆగిపోగా అనుష్క అరుంధతి అప్పటి ముప్పై యాభై టికెట్ రేట్లతోనే 70 కోట్ల దాకా వెళ్లడం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. సో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో సమంత నెంబర్ వన్ గా నిలవడం ఫిక్స్ అయినట్టే. నిర్మాణ సంస్థ ఇంకా ఈ నెంబర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. జనాలు కంటెంట్ కి పట్టం కడుతున్నారు. కేవలం సమంత ఉందని మా ఇంటి బంగారం ఆడటం లేదు. ఇదే సామ్ నటించిన శాకుంతలం ఎంత దారుణంగా పోయిందో చూశాం. సో ఎంత స్టార్ ఉన్నా వాళ్లకు తగ్గ సబ్జెక్టు ఉంటే అద్భుతాలు చేయొచ్చని మరోసారి ఋజువయ్యింది. ఓవర్సీస్ లోనూ అదరగొట్టిన మా ఇంటి బంగారం రెండున్నర మిలియన్లు దాటడమంటే మాటలు కాదు. జనాలకు కనెక్ట్ అయితే అంతే కనకవర్షం కురుస్తుంది.
This post was last modified on July 12, 2026 2:49 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…