Movie News

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ ఇదే ప‌ని చేశాడు. త‌న ప్రొడ‌క్ష‌న్లో వ‌చ్చే ప్ర‌తి సినిమాకూ ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే న‌వీన్ నూలిని సైకో అన్నాడు. కాక‌పోతే ఇది కోపంతో అన్న మాట కాదు. త‌న‌తో ఉన్న చ‌నువుతో అన్న మాట‌. లెనిన్ మూవీ స‌క్సెస్ మీట్‌లో నాగార్జున గొప్ప‌ద‌నం గురించి చెబుతూ.. న‌వీన్ నూలి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నాగ‌వంశీ.

లెనిన్ మూవీకి నాగార్జున కూడా ఒక నిర్మాత అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న స్థాయికి అన్నీ త‌నకు అనుకూలంగానే చేసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ కంఫ‌ర్టే చూశాడ‌ని నాగ‌వంశీ కామెంట్ చేశాడు. మామూలుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసిన ఏ సినిమాకైనా అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఎడిటింగ్ చేయిస్తార‌ని.. కానీ లెనిన్ మూవీకి ఎడిట‌ర్ న‌వీన్ నూలి మాత్రం త‌మ సితార ఆఫీస్‌లో కూర్చునే ప‌ని చేస్తాన‌న్నాడ‌ని నాగ‌వంశీ తెలిపాడు.

న‌వీన్ ఒక సైకో అని.. త‌న‌కు అలవాటైన కుర్చీ, త‌న‌కు ఎప్పుడూ టీ ఇచ్చే బాయ్.. ఇలా ప్ర‌తిదీ త‌న కంఫ‌ర్ట్ మేర‌కే ఉండేలా చూసుకుంటాడ‌ని.. దీంతో నాగార్జున అత‌ణ్ని డిస్ట‌ర్బ్ చేయ‌కుండా సితార ఆఫీసుకే వ‌చ్చి ఈ సినిమా ఎడిటింగ్ ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకున్నార‌ని చెప్పాడు నాగవంశీ. 

లెనిన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ టైంలో నాగార్జున అన్న‌పూర్ణ కంటే సితార ఆఫీసులోనే ఎక్కువగా ఉన్నార‌ని.. 20 రోజుల పాటు వ‌రుస‌గా త‌మ ఆఫీసుకు వ‌చ్చార‌ని.. అలాగే రీ రికార్డింగ్ ప‌నుల కోసం త‌మ‌న్ ద‌గ్గ‌రికి వెళ్లార‌ని.. డిస్ట్రిబ్యూష‌న్ విష‌యంలోనూ త‌న‌కు అల‌వాటైన విధంగానే ప‌ని చేసుకోనిచ్చార‌ని నాగ‌వంశీ తెలిపాడు. నాగార్జున స్థాయికి ఇలా చేయాల్సిన అవ‌స‌రం లేదని.. కానీ అంద‌రినీ ఇలా కంఫ‌ర్ట్‌గా ఉంచ‌డంలోనే ఆయ‌న పెద్ద మ‌నిషో అర్థ‌మైంద‌ని నాగ‌వంశీ వ్యాఖ్యానించాడు.

This post was last modified on July 12, 2026 12:14 am

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

17 minutes ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

40 minutes ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

3 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

4 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

6 hours ago