Movie News

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటేసినా ఇప్పటికీ చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ లేక సతమతమవుతున్న అఖిల్ కు ఎట్టకేలకు లెనిన్ రూపంలో  ఊరట దక్కింది. విడుదలయ్యింది నిన్నే కాబట్టి అప్పుడే ఫైనల్ స్టేటస్ చెప్పలేం కానీ ఓపెనింగ్స్, పికప్, వసూళ్ల నెంబర్లు చూస్తుంటే తన కొరత తీరినట్టే కనిపిస్తోంది. ఇక్కడ తండ్రి నాగార్జున ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1989 ‘శివ’ బ్లాక్ బస్టర్ తర్వాత నాగార్జున వరసగా ప్రయోగాలు చేశారు. ఇతర భాషా దర్శకులను తీసుకొచ్చి కొత్త తరహా సినిమాలివ్వాలని చూశారు. కానీ ఒక్క భారీ హిట్టు పడలేదు. ప్రేమయుద్ధం, నేటి సిద్దార్థ, ఇద్దరూ ఇద్దరే, నిర్ణయం, చైతన్య, శాంతి క్రాంతి, జైత్రయాత్ర, కిల్లర్, అంతం దాకా అన్నీ యావరేజులు లేదా డిజాస్టర్లు. హిందీలో ద్రోహి కూడా ఫ్లాప్ అయ్యింది. ఇవన్నీ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరిగే అర్బన్ డ్రామాలు కావడం గమనించాల్సిన విషయం.

ఆ టైంలో నాగార్జున ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ చేశారు. పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుని పల్లెటూరి యువకుడిగా యువసామ్రాట్ ని చూపించిన విధానం సూపర్ డూపర్ హిట్ అందించింది. ‘అల్లరి అల్లుడు’ కూడా ఇదే టచ్ లో సాగుతూ విజయం సాధించింది. హలో బ్రదర్ లో కనెక్ట్ అయ్యింది దొంగతనాలు చేసే దేవా క్యారెక్టరే. సో మాస్ పల్స్ ని ఒడిసిపట్టుకోవడంలో నాగ్ చేసిన ఆలస్యం కొంత మూల్యాన్ని చెల్లించేసేలా చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరగలేదు.

ఇక అఖిల్ విషయానికి వస్తే డెబ్యూ మూవీ అఖిల్ నుంచి ఏజెంట్ దాకా తను ఏనాడూ మాస్ వర్గాలను దృష్టిలో పెట్టుకోలేదు. మాడర్న్ యువతను లక్ష్యంగా పెట్టుకుని కథలు ఓకే చేయడం చాలా నష్టం చేసింది. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇవేవి సాధారణ జనాలకు ఎక్కేవి కాదు. కానీ లెనిన్ ఆ కోవలో చేరలేదు. చదువు రాని గ్రామీణ యువకుడిగా అఖిల్ లోని అసలైన పెర్ఫార్మన్స్ బయటికి వచ్చింది. అచ్చం తండ్రిలాగే ఇక్కడా పల్లెటూరే హిట్టిచ్చింది.  

This post was last modified on July 11, 2026 12:53 pm

Share

Recent Posts

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

41 minutes ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

2 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

3 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

5 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

5 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

7 hours ago