హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా ‘ఈవిల్ డెడ్’ సినిమాకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. 1981లో దీని మొదటి భాగం విడుదలైనప్పుడు థియేటర్ ఆడియన్స్ హడలిపోయారు. కొందరు గుండెపోటుతో చనిపోయిన ఉదంతాలున్నాయి. కేవలం 4 లక్షల డాలర్లతో తీస్తే 30 మిలియన్ల డాలర్లు వసూలు చేయడం చరిత్రలో నిలిచిపోయింది. ఈవిల్ డెడ్ తర్వాతే అన్ని దేశాల్లో దెయ్యాలను ఆధారంగా చేసుకుని వందల సినిమాలొచ్చాయి.
ఇంత హిస్టరీ ఉన్న ఈవిల్ డెడ్ లో ఇప్పటిదాకా అయిదు చిత్రాలొచ్చాయి. ఈవిల్ డెడ్ 2, ఆర్మీ అఫ్ డార్క్ నెస్ తర్వాత ఇరవై సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. 2013లో టైటిల్ మార్చకుండా ఈవిల్ డెడ్ మరోసారి తీశారు. 2023లో ‘ఈవిల్ డెడ్ రైజ్’ వచ్చి జనాన్ని వణికించింది. తాజాగా ‘ఈవిల్ డెడ్ బర్న్’ అనే కొత్త మూవీ థియేటర్లలో అడుగు పెట్టింది. ఆశ్చర్యకరంగా ఏపీ తెలంగాణలోని పలు థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం విశేషం.
కంటెంట్ విషయానికి వస్తే కథ పాతదే. భర్తను కోల్పోయిన ఆలీస్ ఫ్యామిలీతో కలిసి మనఃశాంతి కోసం దట్టమైన ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్తుంది. అందులో ఉన్న బుక్ అఫ్ డెడ్ అనే పుస్తకం ద్వారా సమాధి చేయబడిన ఆత్మలు మేల్కొంటాయి. దీంతో అలీస్ తో పాటు వచ్చిన వాళ్ళు దెయ్యాలుగా మారి రక్తదాహంతో తపించిపోతాయి. ప్రాణంగా చూసుకున్న వాళ్లే ప్రాణాలు తీయడానికి వస్తారు. ఈ విష వలయం నుంచి అలీషా ఎలా తప్పించుకుని బయట పడిందనేది అసలు స్టోరీ.
కథ కన్నా ఎవిల్ డెడ్ బర్న్ కథనం కట్టి పడేస్తుంది. విపరీతమైన వయొలెన్స్, రక్తపాతం తెరనిండా ఉన్నా ఈ జానర్ ని ఇష్టపడే మూవీ లవర్స్ ని బాగా మెప్పిస్తుంది. మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ కొన్ని ఎపిసోడ్స్ పైసా వసూలు చేయిస్తాయి. థ్రిల్, హారర్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. అయితే కొత్తదనం ఆశిస్తే మటుకు ఈవిల్ డెడ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. వీర ఫ్యాన్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on July 11, 2026 10:24 am
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…