నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ మురుగన్ దేవుడే ప్రధానాంశం కాబట్టి పోలిక పరంగా ఇబ్బంది అవుతుందేమోనని టెన్షన్ పడ్డారు. ధనుష్ టీమ్ నుంచి హఠాత్తుగా అనౌన్స్ మెంట్ రావడం ఒక ఎత్తు అయితే, హడావిడిగా ఏఐలో చేయించిన వీడియో మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తోంది. సాయి అభ్యంక్కర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప అందులో చెప్పుకోవడానికి ఏం లేదు.
అయితే ఇక్కడ టాలీవుడ్ మూవీ లవర్స్ రిలాక్స్ అవ్వొచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ తీస్తున్నది మురుగన్ బయోపిక్ కాదు. కేవలం దైవత్వానికి సంబంధించిన అంశాలే ఉండవు. వర్తమానంతో ముడిపెట్టి ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి విహరింపజేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు రెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. గతంలో అల్లు అర్జున్ ని మెప్పించిన స్క్రిప్ట్ ఇది. సో అంత ఆషామాషీగా ఉండదు. పకడ్బందీ ప్లానింగ్ దీని వెనుక ఉంది .
వెట్రిమారన్ స్టైల్ దానికి విరుద్ధంగా ఉంటుంది. అసలు ఆయన మురుగన్ దేవుడి మీద సినిమా తీస్తున్నారా లేక ఇంకేదైనా సబ్జెక్టుకి ఆయన్ని ముడిపెట్టారా అనేది సస్పెన్స్ గానే ఉంది. కేవలం కౌంటర్ ఇవ్వడానికి ప్రకటన వదిలినట్టు ఉంది తప్ప ముందు నుంచి హోమ్ వర్క్ జరిగిన దాఖలాలు లేవని చెన్నై మీడియానే అనుమానపడుతోంది. అలాంటప్పుడు త్రివిక్రమ్ కలం బలాన్ని మ్యాచ్ చేయడం వెట్రిమారన్ కు పెద్ద సవాల్ గా మారడం ఖాయం.
ఏది ముందు రిలీజ్ అవుతుందో ఇప్పటికిప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. ఒకటి మాత్రం నిజం. తారక్ – త్రివిక్రమ్ కాంబో అంచనాలకు అందని విధంగా ఉండబోతోంది. ప్యాన్ ఇండియా మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకున్న త్రివిక్రమ్ ఆ స్థాయిలోనే స్క్రిప్ట్ రాసుకున్నారట. బడ్జెట్ పరంగా చూసుకున్నా తమిళ మురుగన్ కు చాలా పై స్థాయిలో ఉంటుందనేది వాస్తవం. అప్డేట్స్ కోసమైతే చాలా కాలమే ఎదురు చూడాల్సి ఉంటుంది.
This post was last modified on July 11, 2026 10:18 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…