Movie News

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్ గా అనిపించే దర్శకుడు సుకుమార్ శైలి. 1980 సెటప్ తీసుకుని పక్కా పల్లెటూరి నేపథ్యంలో ఎలాంటి సెల్ ఫోన్లు, ఇంటర్ నెట్ లేని రోజుల్లో చిట్టిబాబు కథని చూపించిన తీరుకి ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పటికీ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ లో అగ్ర స్థానం ఈ సినిమాదే. పెద్ది నటన పరంగా పైన ఉండొచ్చు కానీ సినిమాగా అయితే కాదు.

అక్కడితో మొదలు రంగస్థలం తరహాలో గ్రామీణ నేపధ్యాన్ని తీసుకుని, 90స్ కాలాన్ని వాడుకుని ఎన్ని సినిమాలతో ఎందరు దర్శకులు హిట్లు కొట్టారో లెక్క లేదు. శ్రీకాంత్ ఓదెల దసరా, సుకుమారే తీసిన పుష్ప, త్వరలో రాబోయే ప్యారడైజ్ తో పాటు హరోంహర, భైరవం లాంటి ఎన్నో సినిమాలు ఇదే దారి పట్టాయి. వీటిలో ఫ్లాప్ అయినవి లేకపోలేదు. కానీ పీరియాడిక్ విలేజ్ సెటప్ లో ఉన్న కమర్షియల్ వేల్యూస్ అర్థం చేసుకున్న నిర్మాతలు ఇలాంటి కథలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

తాజాగా వచ్చిన లెనిన్ కూడా 1986 టైంలో మొదలయ్యే స్టోరీ. అచ్చం రంగస్థలం లాగే ఎలాంటి జెన్ జీ రెఫరెన్సులు ఉండవు. రివెంజ్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ పల్లెటూరి మనుషుల క్యారెక్టర్లు రాసుకుని ఒక ఇంటెన్స్ డ్రామా ఇచ్చారు. ప్లస్సులు మైనస్సులు బోలెడు ఉన్నాయి కానీ జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా చేయడంలో వసూళ్లు బాగున్నాయి. దశాబ్దం పైగా అఖిల్ కు ప్రేమకథల్లో రాని విజయం ఇప్పుడీ విలేజ్ మూవీ ద్వారా వచ్చేలా ఉంది.

ఒకరకంగా చెప్పాలంటే సుకుమార్ కనిపెట్టిన ఫార్ములా ట్రెండ్ సెట్టర్ గా మారుతోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది కొనసాగుతూ మంచి ఫలితాలు ఇస్తుండటం గొప్ప విషయం. ఎప్పుడు ఆగుతుందో బ్రేక్ ఇస్తుందో చెప్పలేం కానీ ఇప్పుడప్పుడే స్టాప్ అయ్యే సూచనలు లేవు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నవి కూడా ఇదే జానర్ లో రూపొందుతున్నాయి. రంగస్థలంకి సీక్వెల్ రాలేదు కానీ దాని కోవలో వచ్చినవి మాత్రం డబ్బులు బాగా చేసుకుంటున్నాయి. ఇది ఇప్ప్పట్లో ఆగేది కాదు. 

This post was last modified on July 10, 2026 10:20 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago