Movie News

దురంధర్ విలన్ ‘ఇక్కా’ ఎలా ఉంది

ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా ఒక విలన్ పాత్రతో మేజిక్ చేయడం దర్శకుడు ఆదిత్య ధార్ వల్లే సాధ్యమయ్యింది. దీని దెబ్బకే అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసి దృశ్యం 3 వదులుకున్నారనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో తెగ తిరిగింది. తను ఉన్నాడంటే తమ ప్రాజెక్టుకి అదనపు క్రేజ్ వస్తుందనే నమ్మకం నిర్మాతల్లో బలంగా ఉంది.

ఇంత ఇమేజ్ సంపాదించుకున్న అక్షయ్ ఖన్నా కొత్త మూవీ ఇక్కా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రిలీజయ్యింది. సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటం వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా. నిజాయితీ కలిగిన లాయర్ అర్జున్ (సన్నీ డియోల్) కూతురి ప్రాణం కోసం మర్డర్ కేసులో ఇరుక్కున్న కోటీశ్వరుడి శౌర్యమాన్ (అక్షయ్ ఖన్నా) తరఫున వాదిస్తాడు. ఎన్నో మలుపులు తిరిగిన కేసు ఊహించని మలుపు తీసుకుంటుంది.

సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఇక్కా ఇద్దరి బెస్ట్ యాక్టర్స్ టూ మ్యాన్ షోలా నడుస్తుంది. అక్షయ్ ఖన్నా ఒళ్ళంతా పొగరు నిండిన పెద్దింటి వాడిగా మరోసారి విలన్ షేడ్స్ పోషిస్తే, సన్నీ డియోల్ తనదైన శైలిలో న్యాయవాది క్యారెక్టర్ ని నిలబెట్టారు. అయితే కథనం మరీ ఎంగేజింగ్ గా లేకపోవడం, రెండు ట్విస్టులు తప్ప మిగిలింది రొటీన్ గా సాగడం వల్ల ఇక్కా మరీ ప్రత్యేకంగా అనిపించదు. ఈ జానర్ కు మీరు వీరాభిమానులైతే తప్ప నచ్చడం కష్టం.

గత కొన్నేళ్లలో అన్ని భాషల్లో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా వచ్చేయడంతో ఇక్కాలో స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏమి లేదు. అక్షయ్ ఖన్నా మరోసారి తన మ్యానరిజమ్స్ తో పండించే ప్రయత్నం చేశారు కానీ కొన్నిసార్లు రెహమాన్ డెకాయిట్ తాలూకు ప్రభావమే తెరమీద కనిపించడం కొంత మైనస్ అయ్యింది. 2 గంటల 20 నిమిషాల నిడివిలో ల్యాగ్ ఉంది. సన్నీ, అక్షయ్ తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించిన తిలోత్తమా షోమ్ పెర్ఫార్మన్స్ మరో ఆకట్టుకునే అంశం. 

This post was last modified on July 10, 2026 10:09 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago