Political News

రేవంత్ ఫ్లెక్సిలో జగన్ ఫొటో!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న విషయం ఇప్పటికీ ఏ ఒక్కరికీ తెలియదు. దాదాపుగా అన్ని పార్టీల నేతలతో ఈ ఇద్దరు నేతలు దాదాపుగా కలుపుగోలుగానే ఉంటారు. వారి రాజకీయ ప్రత్యర్థులతోనూ సత్సంబంధాలకే ఈ ఇద్దరూ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత అన్న మాటే వినిపిందచు. ఈ ఇద్దరు పరస్పరం గొడవ పడరు. అలాగని ఒకరికొకరు విమర్శించుకోరు కూదా. ఇక పరస్పర అభినందనలూ వీరి మధ్య కనిపించవు. అలాంటి ఈ ఇద్దరి నేతల ఫొటోలు ఒకే ఫ్లెక్సీలో కనిపిస్తే… ఛాన్సే లేదంటారా? ఎందుకు ఛాన్సు లేదు. ఈ ఇద్దరి నేతలతో కూడిన ఫ్లెక్సీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా వ్యవహరిస్తూ ఉంటే…జగన్ ఏపీలో మాజీ సీఎంగా, విపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకున్న రేవంత్ రెడ్డికి అభినందనలు చెబుతూ… ఆశీర్వాద మహాసభల పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సభలకు జనం భారీగానే వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఖమ్మం జిల్లా జగన్నాథపూరంలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు వస్తున్న రేవంత్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,. పలువురు కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. 

ఇలాంటి ఓ ఫ్లెక్సీ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. జగన్నాథపురం సమీపంలోని మత్కేపల్లి వద్ద కనిపించిన ఈ ఫ్లెక్సీలో ఏముందన్న విషయానికి వస్తే… రేవంత్ భట్టిలు ఒకరినొకరు పట్టుకుని ఉన్న హాఫ్ ఫొటో ఒ వైపు ఉండగా…దాని పక్కనే జగన్ నిలువెత్తు ఫొటో ఉంది.  రేవంత్, భట్టి ఫొటో.. వారిని వారి నడుము వరకే కనిపిస్తుండగా… జగన్ ఫొటో మాత్రం నిలువెత్తులో చిరునవ్వులు సంధిస్తూ కనిపిస్తోంది. అయినా రేవంత్ ఫ్లెక్సీలో జగన్ ఫొటో అనేది నిజంగానే వింత కదా. అందుకే జనం ఆ ఫ్లెక్సీని కన్నార్పకుండా అలా చూస్తూ సాగుతున్నారు.

జగన్ ఏపీ సీఎంగా ఛాన్స్ దక్కించుకున్నప్పుడు అంతా ఆయనను విష్ చేసినా… రేవంత్ మాత్రం ఏమాత్రం స్పందించలేదు. అలాగే.. రేవంత్ సీఎం అయితే జగన్ నుంచీ అదే స్పందన కనిపించింది. కనీసం ఈ ఇరువురు నేతల మధ్య బర్త్ డే గ్రీటింగ్స్ కూడా కనిపించని పరిస్థితి అందరికీ తెలిసిందే. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా జగన్ స్పందిస్తారేమో గానీ.. రేవంత్ పట్ల కనీసం కన్నెత్తి చూడరు. రేవంత్ కూడా జగన్ పట్ల అదే తరహా వైఖరితో సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి ఫొటోలు ఒకే ఫ్లెక్సీలో కనిపించడం గమనార్హం.

This post was last modified on July 10, 2026 4:42 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

53 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago