డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు, నిర్మాతలను కలిసి నరేషన్లు ఇస్తుంటారు వర్ధమాన దర్శకులు. ఐతే వారికి అవకాశం ఇవ్వకపోగా.. కష్టాన్ని దోచుకునేవారిని ఏమనాలి? ఇలాంటి ఉదంతాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంటాయి. తమకంటూ గుర్తింపు లేకపోవడం వల్ల ఒక కొత్త డైరెక్టర్ బాధను పట్టించుకునేవారు కూడా ఉండరు.
తాజాగా ఒక కొత్త దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో బాధను వెళ్లగక్కాడు. తన పేరు భరత్ దర్శన్. వచ్చే శుక్రవారం విడుదల కానున్న ‘ఓ సుకుమారి’ చిత్రంతో అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడిగా అవకాశం కోసం వేరే వాళ్లకు కథ చెబితే.. అందులోని ముఖ్య సన్నివేశాలను, డైలాగులను చోరీ చేసినట్లుగా భరత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘ఓ సుకుమారి’ కథ వేరే వాళ్ల దగ్గరికి వెళ్లి.. చివరికి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కలయికలో సినిమాగా తెరకెక్కినట్లు భరత్ దర్శన్ చెప్పాడు. ఐతే తనతో సినిమా తీస్తారన్న ఆశతో కథ చెబితే.. అందులోని ముఖ్య సన్నివేశాలతో పాటు మంచి వన్ లైనర్ డైలాగులను లేపేసినట్లు చెప్పాడు భరత్ దర్శన్. సంక్రాంతికి విడుదలైన ఒక సినిమాలో ముందు ఒక వ్యక్తికి థ్యాంక్స్ కార్డ్ వేశారని.. ఆ వ్యక్తికే తాను ‘ఓ సుకుమారి’ కథ చెప్పగా, అతను ముఖ్య సన్నివేశాలను ఆ చిత్రంలో పెట్టించేశాడని భరత్ తెలిపాడు.
మరోవైపు ఒక హీరోకు ఈ స్క్రిప్టు పంపిస్తే.. అతను తాను నటించిన సినిమాలో తన వన్ లైనర్స్ వాడేశాడని భరత్ దర్శన్ తెలిపాడు. ‘ఓ సుకుమారి’ షూటింగ్ సగంలో ఉండగా తన సీన్లు, డైలాగులు వేరే సినిమాలో ఉన్న సంగతి తెలిసి, మళ్లీ స్క్రిప్టు రీరైట్ చేసుకోవాల్సి వచ్చిందని భరత్ తెలిపాడు. కొత్త వాళ్లు కథలు చెప్పేటపుడు జాగ్రత్తగా ఉండాలని.. పద్ధతి ప్రకారం వెళ్లాలని.. అగ్రిమెంట్లు చేసుక్ోవాలని.. లేకపోతే ఇలా చౌర్యం జరుగుతుందని అతనన్నాడు.
This post was last modified on July 10, 2026 4:22 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…