లాక్‌డౌన్‌కి ముందు సీక్రెట్‌గా వున్న చాలా బాలీవుడ్ లవ్‌స్టోరీలు ఇప్పుడు సడన్‌గా పబ్లిక్ అయిపోయాయి. లాక్‌డౌన్‌కి ముందే ఈ లవ్స్టోరీల గురించి మీడియాలో గుసగుసలు వినిపించేవి కానీ అప్పుడు సీక్రెట్‌గా వుండడానికే ఇష్టపడ్డారు. అయితే నెలల తరబడి ఇంటికి పరిమితం కావాల్సి రావడంతో చాలా బాలీవుడ్ జంటలు న్యూ ఇయర్‌కి ఓపెన్ అయిపోయారు. మాస్కులు ధరించి వెళితే జనం గుర్తు పట్టలేరని అతి తెలివి చూపించడం కూడా ఇవి పబ్లిక్ అయిపోవడానికి కారణం కావచ్చు. టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ అఫైర్ ఇప్పుడు పబ్లిక్ అయింది.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తోన్న కియారా అద్వానీ కూడా అతనితో కలిసి మాల్దీవుల ట్రిప్పుకి వెళుతూ ఎయిర్‌పోర్టులో ఫోటోగ్రాఫర్లకు దొరికింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కి కార్తీక్ ఆర్యన్‌తో లవ్‌స్టోరీ వుందనేది కూడా న్యూ ఇయర్ ట్రిప్ వల్లే లీకయింది. జాన్వీతో దడక్లో నటించిన ఇషాన్ ఖత్తర్ కూడా అనన్య పాండేతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. బాలీవుడ్ మీడియాకు అడపాదడపా ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి కానీ ఒకేసారి ఇంతమంది బయట పడడం మాత్రం పాండమిక్ మహత్యమేనని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates