తాజాగా ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాతి సినిమా మహేష్‌బాబుతో ఉంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి- మహేష్ మూవీ కన్ఫార్మ్ కాగానే వీరిద్దరి కాంబోలో ఎలాంటి జోనర్ సినిమా వస్తుందా? అని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే జక్కన్నతో ‘బాహుబలి’ టైపులో ఓ ఫిక్షినల్ హిస్టారికల్ మూవీ చేయడానికే మహేష్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్.
ఇప్పటిదాకా మహేష్ బాబు కెరీర్‌లో హిస్టారికల్ మూవీ లేదు. తండ్రి కృష్ణ ఎన్నో హిస్టారికల్, పిరియాడిక్ మూవీస్‌లో నటించినా, మహేష్ మాత్రం ఆ సాహసం ఇప్పటిదాకా చేయలేకపోయాడు. అయితే ‘రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి తాను రెఢీ!’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మహేష్. దాంతో ఇప్పుడు ఈ కాంబోలో వచ్చే మూవీ అలాగే ఉండబోతుందట.
నిజానికి కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’ మూవీని రిమేక్ చేయాలనేది మహేష్ డ్రీమ్. అలాగే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘గూఢచారి 117’ వంటి జేమ్స్ బాండ్ థ్రిల్లర్ తీయాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. కాబట్టి మహేష్ సినిమాలో అల్లూరి కాన్సెప్ట్‌ను మళ్లీ తీసుకోకపోవచ్చు రాజమౌళి. మరి మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటాడో చూడాలి.
This post was last modified on May 5, 2020 2:51 pm
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…
టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోసం ఏపీ కేబినెట్ చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్లే ఉంది. ఎందుకంటే.. పయ్యావుల…
వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…