సంక్రాంతి రష్‍లో ఎందుకని ‘రంగ్ దే’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అందరికంటే ముందుగా మార్చి 26న రంగ్ దే విడుదల కానుందని డేట్ కూడా అనౌన్స్ చేసారు. కానీ అలా అయినా ‘రంగ్ దే’కు సోలో రిలీజ్ దక్కేట్టు లేదు. ఎందుకంటే ఆ డేట్‍కి రానా దగ్గుబాటి నటిస్తున్న ‘అరణ్య’ సినిమా విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని జనవరి నుంచి మార్చికి వాయిదా వేసారు. ఇదిలావుంటే మార్చి 26నే పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ కూడా విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.
సమ్మర్‍లో వచ్చే మొదటి భారీ సినిమాకు అడ్వాంటేజ్ వుంటుంది కనుక దిల్ రాజు అదే డేట్ పక్కా చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే పవన్, రానా కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాత నాగవంశీనే ‘రంగ్ దే’ నిర్మాత కూడా. ఒకవేళ వకీల్ సాబ్, అరణ్య మార్చి 26నే వస్తే రంగ్ దే రిలీజ్ డేట్ వాయిదా వేసుకునే అవకాశాలెక్కువ. పవన్ వీరాభిమాని అయిన నితిన్ చూస్తూ చూస్తూ తన ఫేవరెట్ హీరో సినిమాతో పోటీకి వెళ్లలేడుగా!
This post was last modified on January 7, 2021 1:08 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…